Site icon NTV Telugu

US-Iran: వెనక్కి తగ్గిన అమెరికా.. తెరుచుకున్న ఇరాన్ గగనతలం

Iran

Iran

ఇరాన్‌ విషయంలో అమెరికా దూకుడు తగ్గించినట్లుగా తెలుస్తోంది. నిరసనకారుల్ని కాల్చి చంపడంతో అమెరికా సైన్యం రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తం మారాయి. కానీ తాజాగా పరిస్థితులు సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా దాడుల ప్రణాళిక రద్దు చేసుకున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. చివరి నిమిషంలో అమెరికా తన ప్రణాళికను రద్దు చేసుకున్నట్లు సమాచారం. సైనిక చర్య చేపట్టబోమని ఇరాన్‌కు ట్రంప్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్‌ తమ గగనతలాన్ని తెరిచినట్లుగా అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.

డిసెంబర్ 28 నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. దీంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 3 వేల మంది అధికారికంగా చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. అంతేకాకుండా నిరసనకారులు ఉరితీత కార్యక్రమం కూడా నిలిచిపోయింది.

Exit mobile version