అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్ వచ్చాక.. వేళ్లులన్నీ పైలట్ వైపే చూపిస్తున్నాయి. కాక్‌పిట్‌లో రికార్డైన వాయిస్ ప్రకారం.. ఫ్యూయల్ స్విచ్‌లు ఎందుకు ఆపావంటూ అడగడం.. లేదంటూ ఇంకొకరు సమాధానం చెప్పడం.. ఇలా ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ క్లియర్‌గా రికార్డైంది. అంటే ఇదే విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది. కానీ అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తుండగా ఎందుకు రెండు స్విచ్‌లు ఆగిపోయాయని నిపుణుల్లో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశ పూర్వకంగానే ఒకేసారి రెండు స్విచ్‌లు ఆపేసినట్లుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: టేకాఫ్ ముందు ఇంధన స్విచ్‌లు బాగానే ఉన్నాయి.. అంతలోనే ఎలా ఆగాయి? దీనిపైనే ప్రత్యేక ఫోకస్..!
తాజాగా అమెరికాకు చెందిన సంస్థ కూడా ఎయిరిండియా కెప్టెన్ పాత్రపైనే తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. కాక్‌పిట్‌లో రికార్డైన వాయిస్ ప్రకారం పైలట్ బాడీలాంగ్వేజ్ తీవ్ర అభ్యంతరకరంగా ఉందని అమెరికా తన నివేదికలో అనుమానం వ్యక్తం చేసింది. ఎయిరిండియా కెప్టెన్.. ఉద్దేశ పూర్వకంగానే ఇంధన సరఫరాను నిలిపివేశారని ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన ఒక నివేదిక పేర్కొంది. కెప్టెన్ వాయిస్ ప్రకారం.. ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆప్ చేసినట్లు సూచించిందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Nitish Kumar: ఎన్నికల ముందు నితీష్ వరాలు.. 125 యూనిట్ల విద్యుత్ బిల్లు కట్టొద్దని ప్రకటన
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు బృందంలో అమెరికా అధికారులు కూడా భాగమయ్యారు. ఈ మేరకు అమెరికా అధికారుల దర్యాప్తును అనుసరిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. కాక్‌పిట్‌లో రికార్డైన పైలట్ల వాయిస్ ప్రకారం.. కెప్టెన్ విమానాన్ని రవ్‌వే నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ఫ్యూయల్ స్విచ్‌లు కటాఫ్ స్థానానికి మార్చాడని నివేదికలో పేర్కొంది. దీన్ని గమనించిన మరో పైలట్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఎందుకు కట్ చేశావని అడగానే.. కెప్టె్న్ చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా నివేదికలో స్పష్టం చేసింది. అంటే కెప్టెన్ ఉద్దేశ పూర్వకంగానే ఇంధన స్విచ్‌లను ఆపేశారని పొందిపరిచింది.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో ఘోరం.. గుండెపోటుతో 4వ తరగతి విద్యార్థి మృతి
AI 171 విమానాన్ని 56 ఏళ్ల సుమీత్ సభర్వాల్ నడుపుతున్నారు. ఆయనకు మొత్తం 15,638 గంటలు విమానాలు నడిపిన అనుభవం ఉంది. ఇక కో-పైలట్ క్లైవ్ కుందర్ (32)కు మొత్తం 3,403 గంటలు విమానాలు నడిపిన అనుభవం ఉంది. ఇలా మొత్తంగా చూస్తే ఇద్దరు పైలట్లు కూడా అనుభవం కలిగినవారే. కానీ ఇద్దరి మధ్య ఏదో గందరగోళం నెలకొన్నట్లుగా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ కథనాలపై భారత పైలట్ల సంఘం తీవ్రంగా ఖండించింది. పైలట్లను నిందించడం పాపం అన్నారు. ఇది బాధ్యతారహితమైన చర్యగా పైలట్ల సంఘం పేర్కొంది. చనిపోయిన వారి గురించి ఇలా మాట్లాడడం ఏ మాత్రం భావ్యం కాదని ధ్వజమెత్తింది.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.
