Site icon NTV Telugu

ఆఫ్ఘ‌న్ ప‌రిస్థితిపై ఐరాస ఆందోళ‌న‌… ఇలాగైతే…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో పరిస్థితులు మ‌రింత దిగ‌జారుతున్నాయి.  ఇప్ప‌టికే 80 శాతానికి పైగా భూభాగాల‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నారు.  మ‌రికోన్ని రోజుల్లోనే రాజ‌ధాని కాబూల్ న‌గ‌రాన్ని కూడా త‌మ ఆధీనంలోకి తీసుకుంటామ‌ని చెబుతున్నారు.  ఆఫ్ఘ‌న్ ఆక్ర‌మ‌ణల్లోకి వెళ్లిన ప్రాంతాల్లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని మాన‌వ‌హ‌క్కుల సంఘాలు ఘోషిస్తున్నాయి.  మ‌హిళ‌లు, పిల్ల‌ల ప‌రిస్థ‌తులు ద‌యనీయంగా మారిపోయాయ‌ని, జ‌ర్న‌లిస్టులపై ఆంక్ష‌లు విధిస్తున్నార‌ని, మాట విన‌ని వారిని చంపేస్తున్నార‌ని ఐరాస ఆందోళ‌న చేస్తున్న‌ది.  వెంట‌నే తాలిబ‌న్లు దురాక్ర‌మ‌ణ‌లు ప‌క్క‌న పెట్టి శాంతియుతంగా చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఐరాస జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రి ఆంటోనియో గుటెర్ర‌స్ పేర్కొన్నారు.  బ‌ల‌ప్ర‌యోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవ‌డం స‌రైన మార్గం కాద‌ని, సుదీర్ఘ‌మైన అంత‌ర్యుద్ధానికి దారితీస్తుంద‌ని అన్నారు.  ఇక పౌరుల‌పై దాడుల‌న‌కు తెగ‌బ‌డ‌టం అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల చ‌ట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని, యుద్ధ‌నేరాల‌కు ఏ మాత్రం తీసిపోద‌ని అన్నారు.  ఐరాస పిలుపు మేర‌కు తాలిబ‌న్లు శాంతిస్తారా…చూడాలి.  

Read: జాతిపిత‌కు అమెరికా అత్యున్నత పురస్కారం…!!

Exit mobile version