UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
- బాల్య వివాహాల నిర్మూలనపై ఫలించిన భారత్ పోరాటం
- నవంబర్ 27 అంతర్జాతీయ దినోత్సవంగా యూఎన్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాల్య వివాహాల నిర్మూలన కోసం భారత్ చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మొత్తానికి భారత్ పోరాటానికి అంతర్జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. నవంబర్ 27న ‘బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారత్‌లో కొనసాగుతున్న ఉద్యమానికి ఇది ప్రపంచవ్యాప్త మద్దతుగా భావిస్తున్నారు.
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ 2023 నుంచి ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా’ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వాలు, సమాజాన్ని కార్యాచరణ వైపు నడిపించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.
Also Read
బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై సియెర్రా లియోన్ సెప్టెంబర్ 4న ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం ఆ తీర్మానానికి ఆమోదం లభించింది. నవంబర్ 27 తేదీకి భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 2024 నవంబర్ 27న భారత ప్రభుత్వం ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ ప్రచారాన్ని ప్రారంభించింది. అదే రోజును ఇప్పుడు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించడం విశేషం.
ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని స్వాగతించిన భువన్ రిభు.. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజని అన్నారు. తీర్మానం ఆమోదించే సమయంలో ఐక్యరాజ్యసమితికి ఆహ్వానించిన ఏకైక పౌర సమాజ ప్రతినిధి తానేనని తెలిపారు. 2024 నవంబర్ 27న బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారత్‌లో చేపట్టిన ప్రచారంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రతిజ్ఞ చేశారని రిభు పేర్కొన్నారు. పిల్లలు, స్థానిక సమాజాల నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు ఇచ్చి విస్తరించిందని చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు నిర్ణయాత్మక నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. 2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా అంతం చేయడంతో పాటు ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, అభివృద్ధి అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.
భారత్‌లో తగ్గుతున్న బాల్య వివాహాలు
దేశంలో బాల్య వివాహాల శాతం క్రమంగా తగ్గుతున్నట్లు జాతీయ స్థాయి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-21 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. 20-24 ఏళ్ల వయసున్న మహిళల్లో 23.3 శాతం మంది 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నారు. అదే NFHS-6 (2023-24)లో ఈ శాతం 20.1కి తగ్గింది. బాల్య వివాహాల నిర్మూలనలో దేశంలో జరుగుతున్న ప్రయత్నాల ప్రభావాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని భావిస్తున్నారు.
2026 నాటికి 10 శాతం తగ్గించడమే లక్ష్యం
భారత ప్రభుత్వం 2026 నాటికి దేశంలో బాల్య వివాహాల ప్రాబల్యాన్ని 10 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి బాల్య వివాహాలను నిర్మూలించాలన్న లక్ష్యం ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్-5 (లింగ సమానత్వం)లోని టార్గెట్ 5.3తో అనుసంధానమై ఉంది. బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాలతో పాటు అన్ని రకాల హానికరమైన ఆచారాలను నిర్మూలించడం ఈ లక్ష్యంలో భాగం.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?