Site icon NTV Telugu

Ukraine Russia War: ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి భీకర పోరు సాగిస్తోంది రష్యా… ఇక, ఉక్రెయిన్‌ నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశం అవుతుంది.. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై చర్చించనున్నట్టు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే కాగా.. ఇదే అంశంపై చర్చించేందుకు 199 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ అత్యవసరం సమావేశం అవుతుంది. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ఇప్పటికే ఓటింగ్‌ నిర్వహించారు.. ఈ ఓటింగ్‌లో 15 సభ్య దేశాలు పాల్గొనగా.. ఈ తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లతో ఆమోదం లభించింది. ఇక, ఈ ఓటింగ్‌కు భారత్‌, చైనా, యూఏఈలు దూరంగా ఉండగా.. తన వీటో అధికారంతో రష్యా దానిని అడ్డుకుంది.

Read Also: IND vs SL: టీమిండియా దూకుడు.. మరో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Exit mobile version