Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా కిరాతకంగా వ్యవహరిస్తోంది. సైనికుల హక్కులను కాలరాస్తూ వ్యవహరిస్తోంది. ఇటీవల బఖ్ ముత్ పోరులో ఉండగా ఓ ఉక్రెయిన్ సైనికుడు రష్యా దళాలకు చిక్కాడు. అతడిని నిలబడిన చోట కాల్చి చంపేశారు రష్యా సైనికులు. ఈ వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలన్ స్కీ షేర్ చేశారు. రష్యా యుద్ధనేరాలకు పాల్పడుతుందని ఆరోపించారు. హంతకులను కనుక్కుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశాడు.
ఈ వీడియోలో ఉక్రెయిన్ సైనికులు రష్యాకు బందీగా చిక్కాడు. ఓ కందకంలో సిగరేట్ తాగుతూ కనిపిస్తున్న సైనికుడు ‘‘స్లావా ఉక్రెయిన్’’(గ్లోరీ టు ఉక్రెయిన్) అని చెప్పగానే రష్యా సైనికులు అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. కాల్పుల అనంతరం చనిపో అంటూ రష్యా సైనికుడు మాట్లాడిన మాటలు వీడియోలో వినవచ్చు. చనిపోయిన సైనికుడిని క్రేనియన్ సైన్యం 30వ మెకనైజ్డ్ బ్రిగేడ్ సైనికుడు టైమోఫీ మైకోలయోవిచ్ షాదురాగా గుర్తించారు. ఫిబ్రవరి 3 నుంచి అతడు మిస్సయ్యాడు. అతడిని చంపిన ప్రాంతం రష్యా ఆక్రమించిన ప్రాంతంలో ఉంది.
ఒక యోధుడిని అత్యంత కిరాతకంగా ఎలా చంపారో ఈ వీడియో చూపుతుందని జెలన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుడిని కాల్చిచంపిన హంతకుల గుర్తింపుపై ఇప్పటివరకు నిర్దారణ లేదు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కుబేలా మాట్లాడుతూ.. ఈ యుద్ధం నరమేధానికి మరో రుజువు అని అన్నారు. ఘోరమైన యుద్ధనేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తక్షణ విచారణ కోసం పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆండ్రీ కోస్టిన్ మాట్లాడుతూ.. ఈ విషయంపై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభం అయిందని అన్నారు.
https://twitter.com/lubinetzs/status/1632767920567644160
