ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర పోరు సాగుతోంది.. రష్యా బలగాలకు ఉక్రెయిన్ ఆర్మీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది… యుద్ధంలో చనిపోయే ఉక్రెయిన్ల కంటే.. రష్యా సైనికుల సంఖ్యే భారీగా ఉంటుంది… గత 6 రోజుల్లో ఆరు వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఏడో రోజుకు చేరుకుంది.. ఇప్పటి వరకు కనీసం 14 మంది పిల్లలతో సహా 300 మందికి పైగా పౌరులు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.. ఇక, సైనికులను రవాణా చేసే 846 రష్యా సాయుధ వాహనాలు ధ్వంసం చేశామని.. 29 రష్యా విమానాలు, 29 హెలీకాప్టర్లు కూలిపోయాయని.. 77 రష్యన్ ఆర్టిలరీ వ్యవస్థలు ధ్వంసం చేశామని.. రష్యా పవర్ గ్రిడ్, రైల్వే వ్యవస్థలపై కూడా దాడి చేస్తున్నామని ఉక్రెయిన్ ప్రకటించింది.. అయితే, రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు.. అయినా, లక్ష్యాన్ని సాధించే వరకు ఉక్రెయిన్‌పై దాడిని కొనసాగిస్తామని ఆ దేశ రక్షణ మంత్రి స్పష్టం చేస్తున్నారు..
Read Also: Revanth Reddy: ‘ధరణి’ వల్లే ఆ ఇద్దరి హత్య..
