Site icon NTV Telugu

Volodymyr Zelenskyy: “టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్”గా ఉక్రెయిన్ అధ్యక్షుడు

Time Person Of The Yaar

Time Person Of The Yaar

Ukraine’s Volodymyr Zelenskyy is TIME Person of the Year: అత్యంత శక్తివంతమైన రష్యాను ధిక్కరించి యుద్ధంలో ఉక్రెయిన్ దేశాన్ని రష్యాకు ధీటుగా నిలబెట్టినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ ఈ ఏడాది ‘‘టైమ్స్ పర్స్ ఆఫ్ ది ఇయర్’’గా ఎంపికయ్యారు. రష్యా యుద్ధంతో తన దేశాన్ని ఎదురొడ్డి నిలిచేలా చేసిన జెలన్ స్కీ ధైర్యాన్ని టైమ్స్ మ్యాగజీన్ ప్రశంసించింది. ధిక్కరణ, ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఎదిగారని టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంతల్ అన్నారు. స్వేచ్ఛను రక్షించడానికి ప్రజల్ని ఉత్సాహపరిచడం , ప్రజాస్వామ్యం, శాంతి గురించి ప్రపంచానికి తెలియజేసినందుకు టైమ్స్ 2022కు గానూ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

రష్యా యుద్ధ సమయంలో తమ దేశపౌరులను ధృడసంకల్పంగా నిలిచేలా చేయడంతో పాటు తన ప్రసంగాలతో ప్రజలను, ఆ దేశ సైన్యాన్ని ఉత్తేజపరిచారు. దీంతో ప్రజలతో పాటు ఉక్రెయన్ సైన్యం రష్యా బలగాలకు ఎదురొడ్డి నిలిచారు. రష్యా యుద్ధం తీవ్రం అవుతున్న సమయంలో ఉక్రెయిన్ విడిచిరావాల్సిందిగా అమెరికా జెలన్ స్కీని కోరినా.. అందుకు తిరస్కరించి దేశంలో ప్రజలతోనే ఉన్నారు. దేశానికి, సైన్యానికి కావాల్సిన సహాయాన్ని వెస్ట్రన్ దేశాల నుంచి సంపాదించడంలో జెలన్ స్కీ సఫలం అయ్యాడు.

Read Also: Forbes Most Powerful Women: ప్రపంచంలో శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్..

రష్యా భారీ సైనిక, ఆయుధ సంపత్తిని తట్టుకునేందుకు పలు యూరోపియన్, నాటో దేశాల నుంచి కూడగట్టడంతో జెలన్ స్కీ సక్సెస్ అయ్యారు. అమెరికా నుంచి ఆయుధ, సైనిక వ్యూహాలను ఉక్రెయిన్ సంపాదించేలా చేశాడు. 2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడు అయిన జెలన్ స్కీ ఉక్రెయిన్ డి-రస్సిఫికేషన్ విధానాన్ని అనుసరించాడు. చాలా ఏళ్లుగా రష్యన్ ప్రభావం ఉన్న ఉక్రెయిన్ పై దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. రాజధాని పేరు కీవ్(రష్యన్) నుంచి కైవ్( ఉక్రెయిన్)గా స్పెల్లింగ్ మార్చారు. రష్యన్ భాషలో ఉన్న అనేక సైన్ బోర్డులను మార్చాడు. పుతిన్ సహాయకుడితో నియంత్రించే టీవీ ఛానెళ్లను కూడా జెలన్స్కీ మూసేశాడు.

ఇదిలా ఉంటే రష్యాతో పెట్టుకుని ఉక్రెయిన్ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడనే పలు దేశాలు జెలన్ స్కీని విమర్శిస్తున్నాయి. ఇప్పటికీ ఉక్రెయిన్ దేశంలో చాలా మంది అమాయక ప్రజలు మరణించారు. ఉపాధి లేక, సౌకర్యాలు లేక వేరే దేశాలకు వలస వెళ్తున్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో రానున్న చలికాలం కరెంట్ లేకపోతే జనాలు చాలా ఇబ్బందులు పడతారు.

Exit mobile version