NTV Telugu Site icon

Ukraine ‘Maa Kali’ tweet: “కాళీ మాత” ఫోటోతో వివాదాస్పద ట్వీట్ చేసిన ఉక్రెయిన్.. భారతీయుల ఆగ్రహం

Naa Kali Tweet

Naa Kali Tweet

Ukraine ‘Maa Kali’ tweet: ఉక్రెయిన్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘‘కాళీ మాత’’ అగౌరపరిచేలా వివాదాస్పద ట్వీట్ చేసింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్ చేసింది. రష్యాలో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత ఓ వెలువడిన పోగపై కాళీ మాతను తలిపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తు తెచ్చేలా ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’అనే క్యాప్షన్ తో స్కర్టు ధరించిన స్త్రీ బొమ్మను ట్వీట్ చేసింది. దీనిపై భారత నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.‘ హిందూ ఫోబియా’ అంటూ పలువురు భారతీయులు ఉక్రెయిన్ ను నిందించారు.

Read Also: Rohit Sharma : హైదరాబాద్ లో రోహిత్ శర్మ భారీ కటౌట్

హిందువుల పవిత్ర దైవం అయిన కాళీ మాతను ఎగతాళి చేయడం చూసి విస్తూపోయానని, ఇది అవివేకం, అజ్ఞానం అని, ఈ అభ్యంతరకరమైన కంటెంట్ ను తీసేసి క్షమాపణలు చెప్పాలని, అన్ని మతాలు, విశ్వాసాలను గౌరవించాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరికొందరు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రి జైశంకర్ ను ట్యాగ్ చేస్తూ.. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని కోరారు. మరికొంత మంది భారత్, రష్యాకు మద్దతుగా నిలవడం వల్లే ఉక్రెయిన్ ఇలా చేస్తుందని కామెంట్ చేశారు.

దీనిపై ఇండియన్స్ నుంచి భారీగా విమర్శలు రావడంతో ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ ఈ ట్వీట్ ను డిలీట్ చేసింది. ఇటీవల సెవాస్టోపోల్ లోని రష్యా ఇంధన నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ చేసింది. దీంతో 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 10 కన్నా ఎక్కువ చమురు ఉత్పత్తులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఈ పేలుడు ధాటికి ఓ పెద్ద పొగమేఘం ఆకాశంలోకి వ్యాపించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ డిఫెన్స్ శాఖ ఈ పొగమేఘాన్ని ఉపయోగించి, కాళీమాతను పోలి ఉండేలా ఫోటో మార్ఫింగ్ చేసి ట్వీట్ చేసింది. అయితే దినిపై ఇప్పటి వరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.