Site icon NTV Telugu

Ukraine War: ఉక్రెయిన్ లో కుప్పకూలిన హెలికాప్టర్..హోంమంత్రి సహా 18 మంది మృతి

Ukraine

Ukraine

Ukraine Chopper Crash: ఉక్రెయిన్ లో ఘోరం జరిగింది. రాజధాని కీవ్ కు సమీపంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ హోంమంత్రి, డిప్యూటీ హోంమంత్రితో సహా మొత్తం 18 మంది మరణించారు. ఉక్రెయిన్ అధికారులు బుధవారం ఈ ప్రమాదం గురించి తెలిపారు. చనిపోయిన వారిలో హోం మంత్రి డెనిస్ డెనిస్ మొనాస్టైర్స్కీ మరియు అతని మొదటి డిప్యూటీ మినిస్టర్ యెవ్జెనీ యెనిన్‌తో సహా అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరణించిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఓ స్కూల్ పై హెలికాప్టర్ కూలడం వల్ల చిన్నారులు చాలా మంది గాయాల పాలయ్యారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Read Also: Kanti Velugu: రెండో విడత కంటి వెలుగు ప్రారంభం.. ప్రారంభించిన జాతీయ నేతలు

42 ఏళ్ల మొనాస్టైర్స్కీ 2021లో హోంమంత్రిగా నియమితులయ్యారు. ఈ ప్రమాదంలో సమీపంలోని 10 మంది పిల్లలతో పాటు 22 మందికి గాయాలు అయ్యాయి. రాజధాని కీవ్ కు ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రోవరీ పట్టణంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సేవలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. హెలికాప్టర్ కూలిపోవడంపై రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదే సమయంలో రష్యా నుంచి దాడి ఎదుర్కొన్నట్లు కీవ్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉంటే గత వారం నుంచి రష్యా తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. అమెరికా, బ్రిటన్ నుంచి సైనిక సాయం పొందిన ఉక్రెయిన్ పై వరసగా దాడులు చేస్తోంది రష్యా. ఇటీవల రష్యా దాడులను తట్టుకోవడానికి, ఉక్రెయిన్ ఇటీవలి వారాల్లో పాశ్చాత్య మద్దతుదారులను అధునాతన ట్యాంకులు పొందుతోంది. బ్రిటన్, ఉక్రెయిన్‌కు 14 ఛాలెంజర్ ట్యాంకులను ఇస్తున్నట్లు ప్రకటించింది. వారాంతంలో తూర్పు నగరమైన డ్నిప్రోలోని నివాస భవనాన్ని రష్యా క్షిపణి ఢీకొనడంతో ఆరుగురు పిల్లలతో సహా 45 మంది మరణించిన విషాదం నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది.

Exit mobile version