Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. రష్యన్ దళాలు ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడి చేసింది. మొత్తం 367 డ్రోన్లను, క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ దాడుల్లో ముగ్గురు పిల్లలతో సహా 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. కీవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీలపై దాడులు జరిగాయి. అయితే, ఉక్రెయిన్ వైమానిక దళం 266 డ్రోన్లు, 45 క్షిపణులను కూల్చేవేసింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడిగా పరిగణించబడుతోంది.
Read Also: Kishan Reddy : బీజేపీ- బీఆర్‌ఎస్ పొత్తు అంశంపై స్పందించిన కిషన్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు..!
శుక్రవారం, రాజధాని కీవ్‌ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను రష్యా ప్రయోగించింది. ఓ వైపు ఖైదీల మార్పిడి సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. అయితే, ఈ దాడిపై డొనాల్డ్ ట్రంప్ పాలన సైలెంట్‌గా ఉండటాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. రష్యాపై బలమైన ఆంక్షలు విధించాలని కోరారు. ఒత్తిడి లేకుండా ఏమీ మారదని ఆయన అన్నారు. మరోవైపు, కేవలం నాలుగు గంటల్లోనే రష్యా ఉక్రెయిన్‌కి చెందిన 95 డ్రోన్లను కూల్చేసినట్లు పేర్కొంది. శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణ కోసం ఒత్తిడి చేస్తుండగా ఈ దాడులు జరిగాయి. రెండు దేశాలు ఖైదీలు మార్పిడిని ముగించి, 1000 మందిని మార్పిడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయి.
