Site icon NTV Telugu

Ukraine President: క‌మెడియ‌న్‌గా జీవితాన్ని ప్రారంభించి… అధ్య‌క్షుడిగా ఎదిగిన జెలెస్కీ…

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెస్కీ రాజకీయ జీవితాన్ని ఆరంభించే ముందు ఆయ‌న ఏం చేశారు అనే విష‌యాలు ఇప్పుడు హైలెట్‌గా మారాయి. సోష‌ల్ మీడియాలో జెలెస్కీ గురించి నెటిజ‌న్లు సెర్చ్ చేస్తున్నారు. జెలెస్కీ కి సంబంధించిన చాలా విష‌యాలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. జెలెస్కీ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ఆయ‌న ఓ క‌మెడియ‌న్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఆయ‌న న‌టించిన ఓ టీవీ సీరియ‌ల్ అప్ప‌ట్లో బాగా పాపుల‌ర్ అయింది. పెద్ద ఎత్తున అభిమానుల‌ను సంపాదించిపెట్టింది. ఆ ప్ర‌జాభిమానాన్ని జెలెస్కీ రాజ‌కీయంగా ఎదిగేందుకు వినియోగించుకున్నారు.

Read: Ukraine Crisis: న‌డుచుకుంటూ పోలెండ్ స‌రిహ‌ద్దుల‌కు భార‌తీయ విద్యార్థులు..

కామెడీ సీరియ‌ల్‌లో ఆయ‌న ఓ దేశానికి చెందిన అధ్య‌క్షుడి పాత్ర‌లో న‌టించి మెప్పించారు. అదే పాత్ర‌ను ఆయ‌న త‌న నిజ‌జీవితంలో పోషించాల్సి వ‌స్తుంద‌ని బ‌హుశా అనుకోని ఉండ‌డు. ప్ర‌జాద‌ర‌ణ ల‌భించ‌డంతో ఆయ‌న అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ్డారు. అనేక వాగ్దానాలు చేశాడు. రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని, ర‌ష్యాతో ఉన్న విభేదాల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని వాగ్దానాలు చేశాడు. అంతేకాదు, తాను ఒక‌ప‌ర్యాయం మాత్ర‌మే అధ్య‌క్షుడిగా కొన‌సాగుతాన‌ని మాట ఇచ్చారు. అయితే, జెలెస్కీ మాట‌ల‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు ఆయ‌న్ను అధ్య‌క్షుడిగా ఎంచుకున్నారు. 2019లో జెలెస్కీ అధ్య‌క్షుడు అయ్యాడు. 2014లో ర‌ష్యా క్రిమియాను ఆక్ర‌మించుకున్న‌ప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితులు త‌లెత్త‌లేదు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితులు మ‌రింత‌దారుణంగా మారిపోయాయి.

Exit mobile version