Site icon NTV Telugu

కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్‌…

ఆఫ్ఘ‌నిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు.  తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ‌ల‌తో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది.  మళ్లీ 1996 నాటి పరిస్థితులు వస్తాయని భ‌య‌ప‌డుతున్నారు. భ‌య‌ప‌డిన‌ట్టుగానే జరుగుతున్నది.  శాంతి మంత్రం జపిస్తూనే కాల్పులకు తెగబడుతున్నారు.  మ‌హిళ‌ల‌పై విరుచుకుపడుతున్నారు.  ఎలాగైనా తప్పించుకొని దేశం దాటిపోవాలని చూస్తున్నవారిపై కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు కాబూల్‌లో మరో సంఘటన జరిగింది.  ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని దుండగులు హైజాక్ చేశారు.  విమానం హైజాక్ అయినట్టు అటు ఉక్రెయిన్ విదేశాంగ‌శాఖ ధృవీకరించింది.  విమానాన్ని ఎవరు హైజాక్ చేశారు అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

Read: సముద్రంలో అరుదైన దృశ్యం… సోషల్ మీడియాలో ట్రెండింగ్‌…

Exit mobile version