ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వైఖరి రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతోంది. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా. రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని చేరవేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు.
ఈ నేపథ్యంలో కైవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని రష్యా ఖాళీ చేయడం ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం నాటికి, కైవ్‌లోని రాయబార కార్యాలయంపై రష్యా జెండా ఎగరలేదు మరియు పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. కొన్ని వారాలపాటు ప్రశాంతత కోసం ప్రయత్నించిన తరువాత, ఉక్రేనియన్ అధికారులు బుధవారం కూడా ఆందోళనను పెంచుతున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ రష్యాకు ప్రయాణానికి వ్యతిరేకంగా సలహా ఇచ్చింది.
