ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసే అవకాశం ఉందని, ఫిబ్రవరి 16 నుంచి యుద్ధం జరిగే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. అటు అమెరికా, ఉక్రెయిన్ దేశాలు సైతం రష్యా యుద్దానికి సన్నద్దమవుతున్నట్టు పేర్కొన్నాయి. అయితే, అనూహ్యంగా రష్యా తమ బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించింది. సరిహద్దుల్లో యుద్దవిన్యాసాలను పూర్తి అయిందని, కొన్ని బలగాలనే వెనక్కి పిలిపిస్తున్నట్టు రష్యా రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. రష్యా రక్షణశాఖ ఆదేశాలు వచ్చిన తరువాత కొన్ని బలగాలు, యుద్ద ట్యాంకర్లను రైళ్ల ద్వారా వెనక్కి పంపుతున్నారు. అయితే, ఎంత మందిని వెనక్కి పంపారు అనే దానిపై ఇప్పటి వరకు రష్యా క్లారిటీ ఇవ్వలేదు.
Read: Telugu Bigg Boss OTT : కంటెస్టెంట్స్ వీళ్లేనట… లిస్ట్ వైరల్
క్రిమియా నుంచి కూడా కొన్ని బలగాలు వెనక్కి వచ్చాయి. క్రిమియా నుంచి వెనక్కి వచ్చినా, రష్యాను నమ్మే ప్రసక్తి లేదని, ఏ క్షణంలో అయినా రష్యా దాడులకు దిగొచ్చని ఉక్రెయిన్ చెబుతున్నది. అమెరికా సైతం ఇదే విధంగా స్పందించింది. రష్యా దాడులు చేసే అవకాశం లేకపోలేదని, జాగ్రత్తగా ఉండాలని అంటోంది. ఒకవేళ రష్యా దాడులకు దిగితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుందని అమెరికా హెచ్చరించింది.
