Site icon NTV Telugu

Ukraine Drone Attack: రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్‌

Ukraine Drone Attack

Ukraine Drone Attack

Ukraine Drone Attack: గత మూడు నెలులుగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే. యుద్ధం నేపథ్యంలో రష్యాను కొన్ని దేశాలు సమర్థిస్తుండగా.. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఉక్రెయిన్‌కు సహాయ సహకారాలు అందిస్తోంది. రష్యా వెంటనే యుద్ధం ముగించాలని అమెరికా బహిరంగంగా ప్రకటించింది కూడా. అయినప్పటికీ రెండు దేశాలు కూడా తగ్గడం లేదు. ఉక్రెయిన్‌ రష్యాపై డ్రోన్లతో దాడి చేసింది. మాస్కో శివార్లలో ఉక్రెయిన్‌ డ్రోన్లతో దాడి చేయగా వాటిని కూల్చేసినట్టు రష్యా సైన్యం ప్రకటించింది. డ్రోన్ల దాడితో అప్రమత్తమై రష్యా రక్షణ శాఖ నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపింది. మాస్కో సరిహద్దుల్లోని బ్రియాన్‌స్క్‌ ప్రాంతంలో క్రాస్నోగోర్స్క్ పట్టణంలో నాలుగు డ్రోన్లు ప్రవేశించడంతో వాటిని రష్యా సైన్యం కూల్చివేసింది. గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడింది. ముందు జాగ్రత్తగా వ్నుకోవో, షెరెమెట్యెవో, డొమోడెడెవో, జుకోవ్‌స్కీ ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలను రష్యా అధికారులు నిలిపివేశార.

Read Also: Audimulapu Suresh : టెక్నాలజీలో నాకు చాలా తెలుసనే చంద్రబాబు దొంగ ఓట్లు ఉంటే తెలుసుకోవచ్చు కదా..

చిన్న దేశంగా ఉన్న ఉక్రెయిన్ ఏమీ చేయలేదని రష్యా భావిస్తూ వస్తోంది.. కానీ ఇతర దేశాల సహకారంతో ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడులను ముమ్మరం చేసింది. గత ఆదివారం జరిగిన దాడుల్లో డ్రోన్లు రైల్వే స్టేషన్ పైకప్పు భాగంలోకి దూసుకుపోగా ఐదుగురు ప్రాణాలు కోలోయారని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది వరకు ఉన్నారు. వారిలో 5 మంది మరణించారు.. మరికొంత మంది గాయపడ్డారు. కొందరు ఆసుపత్రిలో మరణించారని తెలిపారు.
అంతకుముందు ఇదే కుర్స్క్ ప్రాంతానికి చెందిన వొల్ఫినోలో కూడా ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆ తరువాత కాలంలో మరింత బలాన్ని పుంజుకున్న ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో కోల్పోయిన ఒక్కో ప్రాంతాన్ని మెల్లగా తిరిగి చేజిక్కించుకుంటోంది. ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడిని రష్యా ఊహించకపోయినప్పటికీ.. జరిగిన దాడిని తిప్పి కొట్టడానికి తగిన ప్రణాళికను రూపొందించుకుంటున్నట్టు మీడియా సంస్థలు ప్రకటించాయి.

Exit mobile version