UK Visa: బ్రిటన్ బాదుడు.. భారీగా పెంచేసిన వీసా ఛార్జీలు

  • బ్రిటన్ బాదుడు
  • భారీగా పెంచేసిన వీసా ఛార్జీలు
  • టూరిస్ట్, స్టూడెంట్స్‌పై భారం
Ukvish

Ukvish

పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఓ వైపు యుద్ధం.. ఇంకోవైపు చమురు, గ్యాస్ సంక్షోభంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో అదును చూసి లండన్ దెబ్బకొట్టింది. భారీగా వీసా ఛార్జీలు పెంచేసింది. దీంతో టూరిస్టులు, చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు గట్టి దెబ్బ తగలనుంది.

స్టూడెంట్, విజిటర్‌ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. వీసా, సెటిల్మెంట్‌, స్పాన్సర్‌ లైసెన్స్‌ ఫీజుల కొత్త ఛార్జీలు ఏప్రిల్‌ 8 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. ఈ మేరకు హోమ్‌ ఆఫీస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల రుసుములు సుమారు ఆరు నుంచి ఏడు శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: ATM Withdraw: రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!

విద్యార్థి వీసా రుసుములు 524 పౌండ్ల నుంచి 558 (రూ.69,814) పౌండ్లకు పెరగనున్నాయి. ఆరు నెలల విజిటర్‌ వీసా ఛార్జీ 127 పౌండ్ల నుంచి 135 (రూ.16,890) పౌండ్లకు పెరుగుతుంది. కార్మిక వీసా దరఖాస్తు రుసుము 769 పౌండ్ల నుంచి 819 (రూ.1,02,470) పౌండ్లకు పెరగనుంది. మూడేళ్లకు పైగా ఉండే దరఖాస్తుల రుసుము 1519 నుంచి 1618 (రూ.2,02,437) పౌండ్లకు పెరగనుంది.

ఇది కూడా చదవండి: Ashok Kharat: జ్యోతిష్కుడి ముసుగులో గలీజ్ దందా.. సిట్ దర్యాప్తులో షాకింగ్ నిజాలు..