Tomato Shortage: ఆర్థిక మందగమనంతో ఇప్పటికే యూకే ఇబ్బందులు పడుతోంది. రానున్న రోజుల్లో ఆర్థికమాంద్యం తప్పదా అనే అనుమానాలు అక్కడి ప్రజల్లో నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ దేశాన్ని టొమాటోల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం యూకేలోని సూపర్ మార్కెట్లలో టొమాటో స్టాల్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also: Eggs And Paneer : ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా.. ఇలా ప్రయత్నించండి
ఇంతగా యూకేను టొమాటో కొరత వేధించడానికి కారణం వాతావరణ ప్రభావమే. యూకేకు ఎక్కువగా దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా నుంచి టొమాటోలు దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా మొరాకో, స్పెయిన్ దేశాల నుంచి యూకేకు ఎక్కువగా టొమాటోలు వస్తుంటాయి. అయితే వేడి వాతావరణం వల్ల పంట దిగుబడి తగ్గింది. ఇదిలా ఉంటే ఇటీవల చల్లని వాతావరణ ఫలితంగా పంట కాలం ఎక్కువ అవుతోంది. దీంతో టొమాటోలకు తీవ్ర కొరత ఏర్పడింది.
మొరాకోలో తీవ్ర వరదలు, వర్షాలు, చల్లని వాతావరణం పంటలపై తీవ్ర ప్రభావం చూపెట్టాయి. ఇలాగే స్పెయిన్ లో గత మూడు నాలుగు వారాల నుంచి ఉన్న వాతావరణం కూడా కొరతకు కారణం అయింది. భారీ వర్షాల కారణంగా ఫెర్రీ రద్దు, రవాణా అంతరాయాలు కూడా యూకే మార్కెట్ లోకి టొమాటోలను తీసుకురావడానికి ఇబ్బందికరంగా మారాయి. దక్షిణ యూరప్ మరియు ఉత్తర ఆఫ్రికాలోని క్లిష్ట వాతావరణ పరిస్థితులు టమోటాలతో సహా కొన్ని పండ్లు మరియు కూరగాయల పంటలకు అంతరాయం కలిగించాయని బ్రిటిష్ రిటైల్ కన్సార్టియంలో ఫుడ్ అండ్ సస్టెనబిలిటీ డైరెక్టర్ ఆండ్రూ ఓపీ చెప్పారు.
Why do we think this is happening? https://t.co/6JtDhCZrjp
— Deborah Meaden 🇺🇦 (@DeborahMeaden) February 19, 2023