బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాని పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ గా ఎవరెన్నిక అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోటీలో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాను ప్రధాని రేసులో ఉంటానని అందరి కన్నా ముందుగానే ఆయన స్పష్టం చేశారు. తాజాగా మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి పోటీకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 8 మంది యూకే ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు.
ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నవారిలో ఇద్దరు భారత సంతతి వ్యక్తుల కూడా ఉన్నారు. మాజీ ఛాన్సలర్ రిషి సునక్ తో పాటు అటార్నీ జనరల్ సెయెల్లా బ్రేవర్‌మాన్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, ఛాన్సలర్ నధిమ్ జహావి, వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మెర్డాంట్, మాజీ క్యాబినెట్ మంత్రులు కెమీ బాడోనోచ్, జేరెమీ హంట్, టోరి బ్యాక్ బెంచర్, టామ్ తగెన్ ధాట్ పోటీలో ఉన్నారు.
Read Also: Rakul Preet Singh: అందుకే తెలుగు సినిమాలు చేయట్లేదు
ప్రధాని రేసులో రిషి సునక్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రధాన మంత్రి పోటీలో ముందు వరసలో ఉన్నారు రిషి సునక్. ఆయన ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి స్వయాన అల్లుడు రిషి సునక్. నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని రిషి సునక్ పెళ్లి చేసుకున్నారు. మరో వైపు భారత సంతతి మహిళ సువెల్ల బ్రేవర్‌మాన్ కూడా పోటీలో ఉన్నారు. 1960లలో కెన్యా, మారిషన్ నుంచి బ్రిటన్ వచ్చారు. అంతకుముందు పాకిస్తాన్ సంతతికి చెందిన సాజిద్ జావిద్, విదేశాంగ మంత్రి రెహ్మాన్ చిస్తీ పోటీ నుంచి వైదొలిగారు.
