UK PM Rishi Sunak’s daughter performs kuchipudi at dance festival in London: యూకే ప్రధానమంత్రిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తుంటారు రిషి సునాక్. దీపావళి వంటి పండగలను కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రధాని పదవి చేపట్టడానికి ముందు ‘గో పూజ’ చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. రెండు తరాల నుంచి బ్రిటన్ లో నివసిస్తున్నప్పటికీ భారతీయ మూలలను మరిచిపోలేదు రిషి సునాక్.
Read Also:China: “జిన్‌పింగ్ దిగిపోవాలి.. అన్‌లాక్ చైనా”.. తీవ్రమవుతున్న నిరసనలు
ఇదిలా ఉంటే రిషి సునాక్-అక్షతామూర్తి ఇద్దరు పిల్లలకు కూడా భారతీయ సంస్కృతి అంటే ఇష్టమే. తాజాగా రిషి సునాక్ కుమార్తె అనౌష్క సునాక్ భారతీయ సంప్రాదాయ నృత్యం కూచిపూడి చేసి అందర్ని ఆకట్టుకుంది. ‘రంగ్-2022’ పేరుతో నిర్వహించిన కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ లో కూచిపూడి నృత్యం చేసి అబ్బురపరిచింది. 4 నుంచి 85 ఏళ్ల వయస్సు ఉన్న 100 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతామూర్తి, ఆయన తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని అనౌష్క ఓ మీడియా ఛానెల్ కు చెప్పింది. దీంతో పాటు కుటుంబం, ఇళ్లు, సంస్కృతి కలిసిన దేశం భారత్ అని, అక్కడకు వెళ్లడం ఇష్టమని చెప్పింది.
రిషి సునాక్ భార్య అక్షతామూర్తి ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి కూతురు. రిషి సునాక్, అక్షతా మూర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూర్ లో 2009లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు కృష్ణ సునాక్, అనౌష్క సునాక్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి వీరిని కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాల నేర్పుతున్నారు.
Anoushka Sunak, daughter of @RishiSunak performed Kuchupudi along with many children at London. pic.twitter.com/5yWSZhWIfe
— Sanjay Kishore (@saintkishore) November 27, 2022