Site icon NTV Telugu

UK PM Race: పుంజుకుంటున్న రిషి సునక్.. లిజ్ ట్రస్ కు గట్టి పోటీ..

Sunak Vs Truss

Sunak Vs Truss

UK PM Race – Rishi sunak: బ్రిటన్ ప్రధాని ఎన్నికలు, కన్జర్వేటివ్ పార్టీకి అధ్యక్ష పదవికి సంబంధించి భారత సంతతి వ్యక్తి రిషి సునక్, మరో అభ్యర్థి లిజ్ ట్రస్ కు మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల కొన్ని సర్వేల్లో ప్రధాని పదవిలో లిస్ ట్రస్ ముందున్నారని వెల్లడించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇటలీకి చెందిన పొలిటికల్ అఫైర్స్ కంపెనీ టెక్నీ నిర్వహించిన ఓ సర్వేలో రిషి సునక్ పుంజుకున్నట్లు వెల్లడించింది. వీరిద్దరి మధ్య తేడా కేవలం 5 శాతం ఉన్నట్లు వెల్లడించింది. ఇటలీకి చెందిన టెక్నీ నిర్వహించిన సర్వేలో గత వారం మొత్తం 807 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను సర్వే చేసింది. ఈ సర్వేలో సునాక్ కు 43 శాతం మంది మద్దతు తెలపగా.. లిజ్ ట్రస్ కు 48 శాతం మంది మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. దీంతో వీరిద్దరి మధ్య తేడా కేవలం 5 శాతానికి తగ్గింది.

అయితే గత వారం బ్రిటన్ బేస్డ్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ యూగవ్ నిర్వహించిన సర్వేలో రిషికి కేవలం 38 శాతం మద్దతు ఇస్తున్నారని.. లిజ్ ట్రస్ కు 62 శాతం మద్దతు ఉందని వెల్లడించింది. అయితే తాజాగా జరిగిన సర్వేల్లో రిషి సునక్ ఈ తేడాను 5 శాతానికి తగ్గించుకున్నారు. దీనికి ముందు బ్రిటన్ బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ సంస్థ స్మార్కెట్స్ నిర్వహించిన సర్వేలో లిజ్ ట్రస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 90 శాతం లిజ్ ట్రస్ గెలుస్తుందని.. 10 శాతం గెలుపు అవకాశాలే రిషి సునక్ కు ఉన్నాయని తెలిపింది. అయితే ప్రధాని పదవీ రేస్ ప్రారంభం అయినప్పటి నుంచి అనేక 5 రౌండ్లలో రిషి సునక్ కే మద్దతు ఎక్కువగా ఉంది. చివరికి పోటీలో లిజ్ ట్రస్, రిషి సునక్ మిగిలినప్పుడు వీరిద్దరి విజయావకాశాలు 40-60 శాతంగా ఉన్నాయి. అయితే డిబెట్లు ప్రారంభం అయిన తర్వాత లిజ్ ట్రస్, రిషి సునక్ ను అధిగమించారు.

Read Also: Jahangirpuri Violence Case: జహంగీర్‌పురి హింసాకాండ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

అవినీతి ఆరోపణలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో బ్రిటన్ ప్రధాని ఎన్నిక అనివార్యంగా మారింది. ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఎన్నికలు జరగుతున్నాయి. ఈ రెండు పదవులను దక్కించుకోవాలంటే.. పార్టీ సభ్యుల మద్దుతు పొందడంతో పాటు ప్రజా ప్రతినిధుల మద్దతు అవసరం. ప్రస్తుతం ప్రధాని పదవి చేపడితే చేయబోయే సంస్కరణలు, పథకాల గురించి ఇద్దరు నేతలు ముఖాముఖి చర్చల్లో పాల్గొంటున్నారు. దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ.. డిబెట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 5న బ్రిటన్ కు కాబోయే ప్రధాని ఎవరనేది తెలుస్తుంది.

Exit mobile version