Site icon NTV Telugu

UK: హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకున్న బ్రిటన్ ప్రధాని.. ఆదర్శంగా నిలిచిన స్టార్మర్

Ukpm

Ukpm

హెచ్‌వీఐ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా కీర్ స్టార్మర్ బహిరంగంగా హెచ్‌వీఐ పరీక్ష చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. 2023 నాటికి ఇంగ్లాండ్‌లో హెచ్‌ఐవీని అంతం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందుకోసం 2025లో కొత్త హెచ్‌ఐవీ కేసులను నిర్మూలించడానికి యూకే ప్రభుత్వం కొత్త కార్యాచరణ ప్రారంభించింది. ఈ వేసవి కాలంలో హెచ్‌ఐవీ పరీక్షల కార్యక్రమం ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: Gachibowli Drugs: గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం.. బ్రౌన్ హెరాయిన్ సీజ్!

ఇక హెచ్‌వీఐ పరీక్ష గురించి అవగాహన పెంచడానికి టెరెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ ప్రతినిధులు ముందుకొచ్చారు. వారితో కలిసి ఇంట్లోనే ప్రధానమంత్రి స్టార్మర్ రాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఇదిలా ఉంటే స్టార్మర్ స్వయంగా టెస్ట్ చేయించుకోవడం విశేషం. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హెచ్ఐవీ పరీక్ష ఎంతో ముఖ్యమైనదని… ఇందులో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని స్టార్మర్ తెలిపారు. క్షణాల్లో జరిగిపోయే ఈ పరీక్షను వారం రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని చెప్పారు. 2030 నాటికి కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదు కాకూడదనే లక్ష్యాన్ని చేరుకునేందుకు.. ప్రజలు ముందుకొచ్చి టెస్టు చేయించుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: Maha kumbh mela: ఇంకా తీరని ట్రాఫిక్ కష్టాలు.. నిండుకున్న పెట్రోల్, ఆహారం.. భక్తులు అవస్థలు

Exit mobile version