Site icon NTV Telugu

బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు…

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం అని ప్ర‌పంచ దేశాలు ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తున్నాయి.  అన్ని దేశాల్లో ప్ర‌స్తుతం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతున్న‌ది.  అయితే, అభివృద్ది చెందిన దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ప్ర‌జ‌లు ముందుకు రావ‌డంలేదు.  దీంతో అక్క‌డి ప్ర‌భుత్వాలు వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టిస్తున్నాయి. బ్రిట‌న్‌లో ఇప్పుడు ఇదే చేస్తున్నారు.  వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాపింగ్ వోచ‌ర్లు, పిజ్జా డిస్కౌంట్‌లు, ప్ర‌యాణాల్లో రాయితీల పేరుతో వ్యాక్సిన్ వోచర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి.

Read: గుడ్‌ న్యూస్‌ : మరోసారి తగ్గిన బంగారం ధరలు

అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ఇలాంటి ప‌థ‌కాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ప్ర‌భుత్వం ఆశాభావం వ్య‌క్తం చేస్తున్న‌ది. ఇక ఇప్ప‌టికే అనేక కంపెనీలు, పుడ్ డెలివ‌రీ యాప్‌లు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్ర‌త్యేక రాయితీలు క‌ల్పిస్తున్నాయి.  ఇప్పుడు ప్ర‌భుత్వం కూడా ఈ విధానం ప్ర‌వేశ పెట్ట‌డంతో మ‌రికొంత వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ది.  బ్రిట‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వ్యాక్సిన్ వోచ‌ర్స్ లో ఉబెర్‌, బోల్ట్, డెలివెరూ, పిజ్జా పిలిగ్రిమ్స్ సంస్థ‌లు భాగ‌స్వాములుగా ఉన్నాయి.  త‌ప్ప‌కుండా ఈ ప‌థ‌కం వినియోగ‌దారుల‌కు చేరువౌతుంద‌ని ఆయా సంస్థ‌లు చెబుతున్నాయి.  

Exit mobile version