Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Uk Health Minister Matt Hancock Resigns After Breaking Covid Rules With Affair In Office

ఒకే ముద్దు..! మంత్రి పదవి ఊడింది..

Published Date :June 27, 2021 , 1:15 pm
By Sudhakar Ravula
ఒకే ముద్దు..! మంత్రి పదవి ఊడింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మంత్రి ముద్దు వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.. చివరకు ఆయన పదవినే ఊడగొట్టే వరకు వెళ్లింది..! ఏంటి ముద్దుతో పదవులు కూడా పోతాయా? అనే అనుమానం కలుగొచ్చు… నిజమేనండి.. పూర్తి వివరాల్లోకి వెళ్లి పరిశీలిస్తే.. యూకే ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్.. తన సహాయకురాలికి కార్యాలయంలో ముద్దు పెట్టారు… ఈ ముద్దు భాగోతాన్ని సన్‌ వార్తాపత్రిక ప్రముఖంగా ప్రచురించింది.. అయితే, దీనిపై పెద్ద దుమారమే రేగింది.. హాంకాక్‌ ఆ ఘటనపై ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ వివరణ ఇవ్వడంతో.. ఆయన క్షమించేశారు.. కానీ, విపక్షాల మాత్రం విమర్శలకు దిగాయి.. విషయం సీరియస్‌గా మారిపోవడంతో.. చివరకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు హాంకాక్‌… ఈ మేరకు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

also read అఖిలపక్షాన్ని బహిష్కరించిన బీజేపీ.. హాజరైన మోత్కుపల్లి..

కాగా, కరోనా మహమ్మారి మార్గదర్శకాలను పట్టించుకోకుండా కార్యాలయంలో సహాయకురాలికి హాంకాక్ ముద్దుపెట్టడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి.. ప్రధాని క్షమించినా.. ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చిన ఆయన.. చివరకు రాజీనామా చేశారు.. ఈ సందర్భంగా రాసిన లేఖలో.. కరోనా మహమ్మారి నేపథ్యంలో సాధారణ ప్రజలు చేస్తున్న త్యాగాలు చూస్తే.. మనం వారికి ఏదైనా తప్పు చేస్తే.. నిజాయితీగా ఉండటం మన బాధ్యత అవుతుంది.. అని పేర్కొన్నారు హాంకాక్‌. అయితే, ఒక ముద్దే కాదు.. హాంకాక్‌ వ్యవహారంపై చాలా ఆరోపణలు ఉన్నాయి.. 42 ఏళ్ల ఆయన.. 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోగా.. భార్య మార్తతో ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యారు.. కానీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో తన క్లాస్‌మెట్‌గా ఉన్న మహిళలను.. తాను మంత్రి అయిన తర్వాత సహాయకురాలిగా నియమించుకున్నారు.. అంతేకాదు.. ఆమెను సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసుకున్నట్లు ది సన్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది.. ముద్దు సీన్‌ వివాదం కావడంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారని రాసుకొచ్చింది. మొత్తంగా ఒకే ముద్దు మాట్‌ హాంకాక్‌ మంత్రి పదవి ఊడిపోయేలా చేసింది… అయితే, ఇక్కడ ముద్దు విషయం కానేకాదు.. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసి ముద్దు ఇవ్వడమే అసలు కారణం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Covid 19
  • covid Rules
  • Matt Hancock
  • Matt Hancock resigns
  • UK health minister Matt Hancock

తాజావార్తలు

  • Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

  • PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్‌లో మోడీ ప్రచారం

  • Coconut Rice: సమయం తక్కువ, రుచి ఎక్కువ.. పిల్లలు ఇష్టంగా తినే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మీ కోసం..

  • Nizamabad: కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ..

  • Jayaprada’s Son Samrat: వెండితెరకు మరో వారసుడు.. జయప్రద తనయుడు సామ్రాట్ గ్రాండ్ ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions