మంత్రి ముద్దు వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.. చివరకు ఆయన పదవినే ఊడగొట్టే వరకు వెళ్లింది..! ఏంటి ముద్దుతో పదవులు కూడా పోతాయా? అనే అనుమానం కలుగొచ్చు… నిజమేనండి.. పూర్తి వివరాల్లోకి వెళ్లి పరిశీలిస్తే.. యూకే ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్.. తన సహాయకురాలికి కార్యాలయంలో ముద్దు పెట్టారు… ఈ ముద్దు భాగోతాన్ని సన్ వార్తాపత్రిక ప్రముఖంగా ప్రచురించింది.. అయితే, దీనిపై పెద్ద దుమారమే రేగింది.. హాంకాక్ ఆ ఘటనపై ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వివరణ ఇవ్వడంతో.. ఆయన క్షమించేశారు.. కానీ, విపక్షాల మాత్రం విమర్శలకు దిగాయి.. విషయం సీరియస్‌గా మారిపోవడంతో.. చివరకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు హాంకాక్… ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.
also read అఖిలపక్షాన్ని బహిష్కరించిన బీజేపీ.. హాజరైన మోత్కుపల్లి..
కాగా, కరోనా మహమ్మారి మార్గదర్శకాలను పట్టించుకోకుండా కార్యాలయంలో సహాయకురాలికి హాంకాక్ ముద్దుపెట్టడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి.. ప్రధాని క్షమించినా.. ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చిన ఆయన.. చివరకు రాజీనామా చేశారు.. ఈ సందర్భంగా రాసిన లేఖలో.. కరోనా మహమ్మారి నేపథ్యంలో సాధారణ ప్రజలు చేస్తున్న త్యాగాలు చూస్తే.. మనం వారికి ఏదైనా తప్పు చేస్తే.. నిజాయితీగా ఉండటం మన బాధ్యత అవుతుంది.. అని పేర్కొన్నారు హాంకాక్. అయితే, ఒక ముద్దే కాదు.. హాంకాక్ వ్యవహారంపై చాలా ఆరోపణలు ఉన్నాయి.. 42 ఏళ్ల ఆయన.. 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోగా.. భార్య మార్తతో ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యారు.. కానీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తన క్లాస్‌మెట్‌గా ఉన్న మహిళలను.. తాను మంత్రి అయిన తర్వాత సహాయకురాలిగా నియమించుకున్నారు.. అంతేకాదు.. ఆమెను సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసుకున్నట్లు ది సన్ పత్రిక తన కథనంలో పేర్కొంది.. ముద్దు సీన్ వివాదం కావడంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారని రాసుకొచ్చింది. మొత్తంగా ఒకే ముద్దు మాట్ హాంకాక్ మంత్రి పదవి ఊడిపోయేలా చేసింది… అయితే, ఇక్కడ ముద్దు విషయం కానేకాదు.. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసి ముద్దు ఇవ్వడమే అసలు కారణం.