Hormuz: హార్ముజ్‌పై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త వ్యూహం.. ట్రంప్‌నకు ఎదురుదెబ్బేనా?
- హార్ముజ్‌పై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త వ్యూహం
- ట్రంప్ ప్రణాళికలో కలిసే ప్రసక్తేలేదని వెల్లడి
- దీంతో ట్రంప్‌నకు దూరం అవుతున్న నాటో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్‌నకు పూర్తిగా నాటో దూరం అయిపోతుందా? ఇకపై సంబంధాలు అంతంత మాత్రమేనా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఏ విధంగానూ నాటో మద్దతు ఇవ్వలేదు. కనీసం వైమానిక స్థావరం ఇచ్చేందుకు కూడా బ్రిటన్ నిరాకరించింది. దీంతో ట్రంప్ ఒక రేంజ్‌లో నాటోపై విరుచుకుపడ్డారు. పిరికి నాటోగా అభివర్ణించారు. మా సాయం లేకుండా మనుగడ సాధించగలదా? అని కూడా ట్రంప్ ప్రశ్నించారు.
ఇటీవల ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో హార్ముజ్‌ను దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అనేక దేశాలు కూడా కలుస్తాయని కూడా ప్రకటించారు. కానీ ఆ దేశాల పేర్లు మాత్రం వెల్లడించలేదు. అయితే ట్రంప్ దిగ్బంధంలో కలవబోమని బ్రిటన్, ఫ్రాన్స్ తేల్చి చెప్పాయి.
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
తాజాగా హార్ముజ్‌పై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త వ్యూహాన్ని రూపొందించాయి. అయితే తమ కొత్త వ్యూహంలో చేతులు కలపాలని 40కు పైగా దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. తాము అమెరికా దిగ్బంధన ప్రణాళికలో భాగం కాబోమని.. ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తు్నట్లుగా ఫ్రాన్స్, బ్రిటన్ ప్రకటించాయి. సమన్వయంతో కూడిన ప్రణాళికను చర్చించడానికి ఈ వారమే ఒక శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా బ్రిటిన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ఈ సమావేశంలో హార్ముజ్‌పై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు.
మాక్రాన్..
‘‘రాబోయే రోజుల్లో యూకేతో కలిసి హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధిరించేందుకు శాంతియుత మిషన్‌తో ముందుకెళ్తున్నామని.. మాతో సహకరించే దేశాలతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తాం.’’ అని మాక్రాన్ రాసుకొచ్చారు.
ట్రంప్ దిగ్బంధంలో నాటో చేతులు కలపకపోవడం అమెరికాకు పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. అన్ని దేశాల మద్దతు హార్ముజ్ దిగ్బంధించాలని ట్రంప్ వ్యూహం పన్నారు. కానీ అందుకు భిన్నంగా నాటో స్వరం వినిపించింది. ట్రంప్‌తో కలిసే ప్రసక్తే లేదని బ్రిటన్, ఫ్రాన్స్ తేల్చి చెప్పాయి. దీంతో ట్రంప్‌తో నాటోకు పొసగడం లేదని అర్థమవుతోంది. భవిష్యత్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
Aucun effort ne doit être ménagé pour parvenir rapidement à un règlement solide et durable du conflit au Moyen-Orient par la voie de la diplomatie.
Un règlement qui permette de doter la région d’un cadre robuste permettant à chacun de vivre en paix et en sécurité.…
— Emmanuel Macron (@EmmanuelMacron) April 13, 2026
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!