NTV Telugu Site icon

UK Couple: విమానంలో యూకే జంట పాడుపని.. షాకైన ప్రయాణికులు

Ukcouple

Ukcouple

నేటి యువతకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. నలుగురు చూస్తున్నారా? ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్‌గానే జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ జంట బైక్‌పై వెళ్తూ ముద్దుల్లో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇలా జంటలు ఈ మధ్య రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలా రోడ్లపై కొన్ని జంటలు ఇలా చేస్తుంటే.. ఓ జంట ఏకంగా విమానంలోనే లైంగిక చర్యలకు పాల్పడింది. సహా ప్రయాణికులు ఉన్నారన్న భయం ఏ మాత్రం లేకుండా శృంగారంలో మునిగిపోయారు. ఆ జంట ఎవరు? ఎక్కడ జరిగింది? ఆ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Rolls-Royce Cullinan Series II: రోల్స్ రాయిస్ నుంచి కొత్త వెర్షన్ లాంచ్.. పూర్తి వివరాలు ఇవే

యూకేకు చెందిన బ్రాడ్లీ స్మిత్ (22), ఆంటోనియా(20) ఇద్దరూ స్పెయిన్‌లోని టెనెరిఫ్‌లో గడిపేందుకు వెళ్లారు. మార్చి 3న స్పెయిన్ నుంచి బ్రిస్టల్‌కు ఈజీజెట్ విమానంలో బయల్దేరారు. ఫ్లైట్‌లో బ్రాడ్లీ స్మిత్‌కు 16 A, ఆంటోనియాకు 16 B సీట్లు పక్కపక్కనే వచ్చాయి. 16 Cలో మరో ప్రయాణికుడు ఉన్నాడు. వారి వెనుక సీటులో తల్లి, కూతురు ఉన్నారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో బ్రాడ్లీ స్మిత్, ఆంటోనియా ఇద్దరూ లైంగిక చర్యకు దిగారు. ఎవరికి కనిపించకుండా పెద్ద దుస్తులను కప్పి శృంగారంలో పాల్గొన్నారు. పక్క సీటులో కూర్చున్న వ్యక్తికి అనుమానం వచ్చి చూడగా జంట లైంగిక చర్యలో ఉండడం చూసి షాక్ అయ్యాడు. వెనుక సీటులో ఉన్న తల్లికూతురు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రయాణికులు విమాన సిబ్బందికి తెలియజేశారు. టేకాప్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్ చేసిన తర్వాత జంటను విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: ముడిచమురు ధర తగ్గినా.. పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇటీవల జంటను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణలో కోర్టు ముందు జంట నేరాన్ని అంగీకరించారు. విమానంలో లైంగిక చర్యకు పాల్పడినట్లు ఇద్దరూ ఒప్పుకున్నారు. జంటకు వ్యతిరేకంగా ముగ్గురు వ్యక్తులు సాక్ష్యం ఇచ్చారు. పబ్లిక్ ప్లేస్‌లో లైంగిక చర్యకు పాల్పడినందుకు కోర్టు శిక్ష విధించింది. ముగ్గురు సాక్షులకు ఒక్కొక్కరికి 100 పౌండ్లు (సుమారు రూ. 11,000) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అదనంగా బ్రాడ్లీకి 300 గంటలు, ఆంటోనియాకు 270 గంటలు సమాజ సేవను చేయాలని తీర్పు వెల్లడించింది. న్యాయమూర్తి లిన్నే మాథ్యూస్ ఈ జంటకు శిక్ష విధించారు. విమానంలో తప్పుడుగా ప్రవర్తించినందుకు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Bhagat Singh Jayanti: ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడు.. షాహిద్ భగత్‌సింగ్