NTV Telugu Site icon

UK: టీవీల్లో జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం.. యూకే కీలక ఆదేశాలు

Junkfoodbanuk

Junkfoodbanuk

జంక్ ఫుడ్‌పై యూకే కీలక ఆదేశాలు జారీ చేసింది. పగటి పూట టీవీ ప్రసారాల్లో జంక్ ఫుడ్ ప్రకటనలు ఇవ్వొద్దని యూకే ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించింది. అలాగే పిల్లల ఆరోగ్యం దృష్ట్యా యూకే కూడా కీలక నిర్ణయం తీసుకుంది. జంక్ ఫుడ్ కారణంగా పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నట్లుగా సర్వేలో తేలింది. దీంతో పగటి పూట టీవీల్లో జంక్ ఫుడ్ ప్రకటనలు నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ఈ చర్యలు అక్టోబర్, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి: Pushpa 2: ‘పుష్ప 2’ వేయలేదని థియేటర్ పై రాళ్ల దాడి

ఎన్‌హెచ్‌ఎస్ సర్వే ప్రకారం ప్రతి 10 మంది చిన్నారుల్లో నాలుగేళ్లలోనే ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని.. ఐదేళ్లలో ఒకరు ఎక్కువ చక్కెర తినడం వల్ల దంత క్షయంతో బాధపడుతున్నారని తేలింది. జంక్ ఫుడ్ కారణంగా చిన్నారుల భవిష్యత్ ఇబ్బందికరంగా మారుతుందని తేలింది. దీంతో టీవీల్లో ప్రసారాలు నిలిపివేయాలని యూకే ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆంక్షలు మాత్రం అక్టోబర్, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి: Delhi: ఉబర్‌కు కోర్టు షాక్.. టైమ్‌కి క్యాబ్ రానందుకు రూ.54వేలు ఫైన్

చక్కెర, కొవ్వు మరియు ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉన్న వస్తువుల ప్రకటనలు పగటిపూట నిషేధించింది. ఇందులో క్రోసెంట్‌లు, పాన్‌కేక్‌లు, వాఫ్ఫల్స్, గ్రానోలా, ముయెస్లీ, ఇన్‌స్టంట్ గంజి వంటి చక్కెర అల్పాహారాలున్నాయి. తియ్యటి ఫిజీ డ్రింక్స్, కొన్ని పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్, పప్పు క్రిస్ప్స్, సీవీడ్ ఆధారిత ట్రీట్‌లు, బాంబే మిక్స్ వంటి స్నాక్స్ కూడా జాబితాలో ఉన్నాయి. సాంప్రదాయ హాంబర్గర్లు, చికెన్ నగ్గెట్‌లు కూడా చేర్చబడ్డాయి. ఈ ప్రకటనలపై నిషేధం విధించింది. ఈ చర్యల ద్వారా ఏటా దాదాపు 20,000 ఊబకాయం కేసులను నిరోధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: PSLV C59 Launch: ‘ప్రోబా-3’ మిషన్‌ విజయవంతమైంది: ఇస్రో ఛైర్మన్