Site icon NTV Telugu

కీల‌క నిర్ణ‌యం: నెల రోజుల‌పాటు డ్రోన్‌ల‌పై నిషేధం…

ఇటీవ‌లే యూఏఈ రాజ‌ధాని అబుదాబీలో డ్రోన్ దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  ఈ దాడిలో ముగ్గురు మృతి చెందారు.  యెమ‌న్‌కు చెందిన హుతీ ఉగ్ర‌వాదులు ఈ దాడుల‌కు పాల్ప‌డింది.  దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.  నెల రోజుల‌పాటు డ్రోన్‌లు, లైట్ స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్య‌క‌లాపాల‌పై నిషేధం విధిస్తున్న‌ట్టు ఆ దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల శాఖ స్ప‌ష్టం చేసింది.  డ్రోన్‌ల‌ను ఎర‌గ‌వేస్తూ వాటిని దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆరోపించింది.  ఎవ‌రైనా స‌రే డ్రోన్‌ల‌ను ప్ర‌యోగిస్తే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.  డ్రోన్ దాడుల త‌రువాత గ‌ల్ఫ్‌లో ఉద్రిక్త‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  

Read: కాంగ్రెస్ స్వాతంత్య్ర సమరయోధులను ప్రజలు మరిచిపోయేలా చేసింది : రాజాసింగ్

సౌదీ అరేబియాకు చెందిన సంకీర్ణ‌ద‌ళాలు యెమ‌న్‌లోని హుతీ ఆధీనంలో ఉన్న ప్రాంతాల‌పై దాడులు చేసింది.  యెమ‌న్ రాజాధాని స‌నాలో హుతీ స్థావ‌రాలే ల‌క్ష్యంగా వైమానిక దాడులు చేసింది.  అటు సాదా జైలుపై కూడా సౌదీ అరేబియా ద‌ళాలు దాడులు చేశాయి.  ఈ దాడుల్లో సుమారు 70 మందికి పైగా ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించార‌ని తెలుస్తోంది.  

Exit mobile version