NTV Telugu Site icon

London: యూకేలో తొలి దళిత మేయర్‌.. భారత సంతతికి చెందిన మహిళ రికార్డు

Mohinder K. Midha

Mohinder K. Midha

భారత సంతతికి చెందిన నాయకురాలు యూకేలో రికార్డు సృష్టించారు.. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కౌన్సిలర్‌గా ఉన్న మొహిందర్‌ కె.మిధా.. పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో.. యూకేలో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డులకెక్కారు మొహిందర్‌ కె.మిధా… ఆమె గతంలో కౌన్సిల్‌కు డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో 2022-23 తదుపరి ఏడాది కాలానికి మిధాను ఎన్నుకున్నారు. ఇక, మొహిందర్ మిధా ఈలింగ్ మేయర్‌గా ఎన్నికైనందుకు మాకు చాలా గర్వంగా ఉందని లేబర్ పార్టీ ఇన్ ఈలింగ్ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Kaleshwaram Project:పోలీస్ పహారాలో కాళేశ్వరం

ఈ ఎన్నికలను బ్రిటిష్ దళిత సంఘాలు గర్వించదగ్గ ఘట్టంగా పేర్కొంటున్నాయి.. యూకేలో మొట్టమొదటి దళిత మహిళా మేయర్.. మాకు గర్వకారణమైన క్షణం అని ఆ దేశంలో దళిత హక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న గొడుగు సమూహం అయిన ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైట్ అండ్ బౌద్ధ సంస్థ చైర్మన్ సంతోష్ దాస్ అన్నారు. లండన్‌లో మే 5న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈలింగ్ కౌన్సిల్‌లోని డోర్మర్స్ వెల్స్ వార్డుకు లేబర్ కౌన్సిలర్‌గా తిరిగి ఎన్నికైన శ్రీమతి మిధా, గతంలో కౌన్సిల్‌కు డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు.

Show comments