Site icon NTV Telugu

అక్క‌డ ఈరోజు నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు సంపూర్ణ లాడ్‌డౌన్‌…

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి భూప్ర‌పంచం ఎప్ప‌టికి బ‌య‌ట‌ప‌డుతుందో ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు.  మ‌రో మూడు నాలుగేళ్ల‌పాటు క‌రోనా నుంచి ఇబ్బందులు త‌ప్పేలా క‌నిపించ‌డంలేదు.  కేసులు పెరిగిన‌పుడు లాక్‌డౌన్ చేసుకుంటూ కంట్రోల్ అయిన‌పుడు తెరుస్తూ జీవ‌నం సాగిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే భార‌త్ పొరుగునున్న బంగ్లాదేశ్‌లో కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి.  దీంతో ఆక్క‌డ ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేసేందుకు సిద్ధ‌మైంది ఆ దేశం.  జులై 23 నుంచి రెండు వారాల పాటు అంటే ఆగ‌స్టు 5 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  

Read: గుడ్ న్యూస్ : ఈరోజు తగ్గిన బంగారం ధరలు

రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  బ‌క్రీద్ సంద‌ర్బంగా అనేక స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో గ‌త వారం రోజుల నుంచి కేసులు భారీ స్థాయిలో న‌మోదవుతున్నాయి.  కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  ఈరోజు ఉద‌యం 8 గంట‌ల నుంచే దేశ‌వ్యాప్తంగా ఆంక్ష‌లు అమ‌లులోకి వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  దేశ‌వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పారామిల‌ట‌రీ, ఆర్మీ, పోలీసుల ప‌హారా ఉంటుంద‌ని, అన‌వ‌స‌రంగా ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని అంటున్నారు అధికారులు.  

Exit mobile version