NTV Telugu Site icon

Turkey Terror Attack: టర్కీ రాజధానిలో భారీ ఉగ్రదాడి.. 10 మందికి పైగా మృతి..

Turkey Terror Attack

Turkey Terror Attack

Turkey Terror Attack: టర్కీ రాజధాని అంకారాలో భారీ ఉగ్రదాడి జరిగింది. టర్కీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంపై బుధవారం ఘోరమైన దాడి జరిగింది. తుపాకులు, బాంబులతో దాడి చేశారు. ‘‘అంకారాలోని కహ్రామంకజాన్‌లోని TUSAS సౌకర్యాలపై తీవ్రవాద దాడి జరిగింది. దురదృష్టవశాత్తు, మాకు చనిపోయిన వారు మరియు గాయపడిన వ్యక్తులు ఉన్నారు” అని అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 10 మంది కన్నా ఎక్కువ ప్రజలు చనిపోయినట్లు తెలుస్తోంది.

Read Also: Maharashtra Elections: ఉద్ధవ్ సేన, కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీ చెరో 85 సీట్లలో పోటీ..

అసలు ఈ దాడి ఎవరు చేశారనే దానిపై స్పష్టత రాలేదు. చాలా మందిని బందీలుగా చేసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఆత్మహుతి దాడి జరిగిందని, భవనంలో బందీలు ఉన్నారని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే, అధికారులు మాత్రం వీటిని ధృవీకరించలేదు. ఉద్యోగులు సాయంత్రం ఇంటికి వెళ్లే సందర్భంలో ఎగ్జిట్ పాయింట్స్ వద్ద బాంబు పేలుళ్లు జరగొచ్చని అధికారులు చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తులు భవనంలోని రైఫిళ్లు, బ్యాక్‌ప్యాక్స్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. TUSAS టర్కీ యొక్క అత్యంత ముఖ్యమైన రక్షణ మరియు విమానయాన సంస్థలలో ఒకటి. ఇది ఇతర ప్రాజెక్టులతో పాటు టర్కీ మొట్టమొదటి జాతీయ యుద్ధ విమానం కాన్‌ని ఉత్పత్తి చేసింది. దీంట్లో 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.