Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. గతంలో వచ్చిన భూకంపం తాలూకూ భయాలు మరవక ముందే, గురువారం రోజు 5.2 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది. టర్కీలోని కోన్యాలో ఈ భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం రాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ప్రస్తుతం పర్యటిస్తున్న దేశ రాజధాని అంకారాలో కూడా భూకంపం వచ్చింది.
Read Also: Shehbaz Sharif: సియాల్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన పాక్ ప్రధాని.. కారణమిదేనా?
టర్కీ సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్సులోల భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఇస్తాంబుల్, అంకారా లతో పాటు ఇతర ప్రాంతాలను కుదిపేసింది. 16 మిలియన్ల జనాభా ఉన్న ఇస్తాంబుల్ నగరంలోని పలు ప్రాంతాల్లో జనాలు భయాందోళనతో పరుగులు తీశారు. అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.
🔶 5.2-Magnitude earthquake strikes near Ankara during Zelensky’s visit
Earthquake of magnitude 5.2 strikes Konya, Turkey — tremors felt all the way in Ankara, where Zelensky is currently located.
No damage or casualties have been reported yet. pic.twitter.com/NAjBzANfrw
— Monika (@Monika_is_His) May 15, 2025
