Site icon NTV Telugu

Trump-Iran: ఆలస్యం చేయొద్దు.. సీరియస్‌గా తీసుకోండి.. చర్చలపై ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Trump

Trump

ఇరాన్‌కు అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. చర్చలపై ఆలస్యం చేయొద్దని.. సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఒప్పందం కోసం అమెరికాను ఇరాన్ బతిమాలుకుందని.. కానీ బహిరంగంగా మాత్రం చర్చల విషయాన్ని ఖండిస్తోందని పేర్కొన్నారు.

ట్రూత్ సోషల్ మీడియాలో ఇరాన్ హెచ్చరిస్తూ రాసుకొచ్చారు. ‘‘ఇరాన్ సైనికంగా నాశనం అయిందని.. తిరిగి పుంజుకునే అవకాశమే లేదు. అయినా ఇరాన్ మధ్యవర్తులు చాలా విచిత్రమైన వారు.. మరీ ఆలస్యం కాకముందే చర్చలపై సీరియస్‌గా తీసుకోవాలి. మళ్లీ రంగంలోకి దిగితే.. తిరిగి వెనక్కి తగ్గే ప్రసక్తే ఉందదు. పర్యవసానాలు ఏ మాత్రం బాగుండవు.’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవు అని.. యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ అంటోంది. యుద్ధం అమెరికా ప్రారంభించింది.. ముగింపు మేము చేస్తామంటూ ఇరాన్ చెబుతోంది. ఇలా రెండు దేశాల మధ్య దోబూచులాట జరుగుతోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఒకవేళ చర్చలు విఫలమైతే ఈసారి అమెరికా… ఇరాన్‌లోని ఖర్గ్, అబు మూసా వంటి కీలక ద్వీపాలను స్వాధీనం చేసుకోవడం, చమురు మార్గాలను దిగ్బంధించడం, భారీ వైమానిక దాడులు, భూతల కార్యకలాపాలు ప్రారంభించడం వంటి ప్రత్యామ్నాయాలకు అమెరికా సిద్ధమవుతోందని ఆక్సియోస్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే భారీగా అమెరికా బలగాలను మోహరింపజేస్తోందని తెలిపింది.

ఇది కూడా చదవండి: US-Iran War: ఇరాన్‌లో ఎవరూ ఉండొద్దు.. తక్షణమే ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక

Exit mobile version