Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- అమెరికా, చైనాల మధ్య అపనమ్మకాలు..
- చైనీస్ గిఫ్ట్స్, బ్యాడ్జీలను చెత్తబుట్టలో పారేసిన అమెరికా..
- గూఢచర్యం చేస్తుందనే అనుమానాలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చైనా పర్యటనను ముగించారు. చాలా ఏళ్ల తర్వాత ఒక అమెరికన్ ప్రెసిడెంట్ చైనా వెళ్లడంతో, డ్రాగన్ కంట్రీ విస్తృత ఏర్పాట్లను చేసింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, ట్రంప్‌కు అతిథి మర్యాదల్లో తక్కువ చేయలేదు. అయితే, ఇప్పుడు ఒక విషయం మాత్రం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజింగ్ నుంచి బయలుదేరే ముందు ట్రంప్ టీమ్‌కు చైనా అధికారులు ఇచ్చిన ప్రతీ విస్తువును చెత్తబుట్టలో పడేసినట్లు తెలుస్తోంది. ఇలా పడేసిన వాటిలో బ్యాడ్జీలు, ప్రెస్ ఆహ్వానాలు, మెమొంటోలు, బర్నర్ ఫోన్లు వంటివి ఉన్నాయి. చైనా ఇచ్చిన ఏ వస్తువును కూడా అధ్యక్షుడి విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి తీసుకురావొద్దని వైట్ హౌజ్ భద్రతా బృందం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇలా చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. చైనా అధికారులు ఇచ్చిన వస్తువులతో గూఢచర్యం చేసే అవకాశం ఉందనే భయం అమెరికాలో ఉంది. దీంతోనే చైనా వస్తువుల్ని చెత్తబుట్టలో పారేశారు. చైనా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ట్రాకింగ్, స్పైయింగ్ చేసే అవకాశం ఉందని అమెరికా భద్రత వర్గాలు భావిస్తున్నాయి. ఈ పర్యటనకు వెళ్లిన ట్రంప్‌తో పాటు అమెరికన్ అధికారులు, ప్రతినిధులు వారి వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అమెరికాలోనే వదిలి వెళ్లారు. ప్రత్యేకంగా ‘‘బర్నర్ ఫోన్లు’’, తాత్కాలిక ఈమెయిల్ అకౌంట్లనే ఉపయోగించినట్లు సమాచారం. హ్యాకింగ్ నుంచి తమ ఎలక్ట్రానిక్ పరికరాలను రక్షించుకునే ఉద్దేశంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ట్రంప్ చైనా పర్యటనలో అమెరికా, చైనా అధికారుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ టెంపుల్ ఆఫ్ హెవెన్ సందర్శన సమయంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారుల వద్ద ఆయుధాలు ఉండటాన్ని చైనీస్ అధికారులు అడ్డుకున్నట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. ట్రంప్ చైనా పర్యటనలో ఇరు దేశాల మధ్య ఎలాంటి అనుమానాలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!