Site icon NTV Telugu

US: హౌతీలపై జరిపిన దాడి వీడియోను పంచుకున్న ట్రంప్

Trumpvideo

Trumpvideo

గత కొద్ది రోజులుగా యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులపై అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే పదుల కొద్దీ హౌతీలు మరణించారు. తాజాగా అమెరికా మరో భీకర దాడి చేసింది. డజన్ల కొద్దీ హౌతీ ఉగ్రవాదులు మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేశారు. ‘అయ్యో’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘అయ్యో, ఈ హౌతీలు దాడి చేయరు’, ‘‘వాళ్లు మళ్లీ మన ఓడలను ముంచివేయరు!.’’ అంటూ ట్రంప్ రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Rashmika : రష్మిక మందన్న బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు అటెండ్ అయ్యారు?

ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలు లక్ష్యంగా హౌతీ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇరాన్ మద్దతుతో ఈ హౌతీలు చెలరేగిపోతున్నారు. ఈ దాడులు అమెరికా వ్యాపారాలను భారీగా దెబ్బతీస్తున్నాయి. దీంతో అగ్రరాజ్యం ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా హౌతీలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయితే ఒక చోట హౌతీలంతా సమావేశమై చర్చించుకుంటుండగా అమెరికా భీకరమైన బాంబ్‌ను ప్రయోగించింది. అంతే ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరిగింది. ఆ ప్రదేశంలో పెద్ద గుంత ఏర్పడింది. అంతేకాకుండా వాళ్ల శరీరాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విమానాల నుంచి తీసిన వీడియోలో.. ఆ సమీపంలో వాహనాలు నిలిపి ఉంచినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ హౌతీలంతా.. దాడులు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా సమాచారం. ఇంతలోనే ఊహించని దాడి జరగడంతో హతమయ్యారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay-TTD: టీటీడీ ఛైర్మన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ

ఇక దాడి జరగగానే పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. అంతేకాకుండా ఘటనాస్థలిలో భారీ గుంత ఏర్పడింది. వీడియోలో ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తోంది. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకారంగా ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై హౌతీలు దాడి చేస్తు్న్నారు. అంతే ధీటుగా అమెరికా ప్రతీకారం తీర్చుకుంది.

 

Exit mobile version