Site icon NTV Telugu

Trump: నోబెల్ కోసం అలా చేయలేదు.. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ నోట మళ్లీ అదే పాట

Trump2

Trump2

గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని.. ఇక యుద్ధం ముగిసినట్లేనని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఈజిప్టు పర్యటన కోసం ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు డోనాల్డ్ ట్రంప్ బొటనవేలు పైకి చూపిస్తూ విజయ సంకేతం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని మళ్లీ క్రిడెట్ తీసుకున్నారు. ఇదంతా నోబెల్ శాంతి బహుమతి కోసం చేయలేదని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు ఆపానని.. ఇప్పుడు పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Hamas-Israel: నేడు బందీల విడుదల.. ఇజ్రాయెల్‌కు ట్రంప్.. యుద్ధం ముగిసిందని ప్రకటన

సుంకాలు, వాణిజ్య ఒత్తిళ్ల కారణంగా కొన్ని సమస్యలకు పరిష్కారం లభించినట్లుగా పేర్కొన్నారు. ఇందులో భారత్-పాకిస్థాన్ సహా అనేక దీర్ఘకాలిక ఘర్షణలను ముగించినట్లు పునరుద్ధరించారు. భారత్-పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు భారీగా సుంకాలు విధించాల్సి ఉంటుందని బెదిరించడంతో 24 గంటల్లో ఇరుదేశాలు శాంతి ఒప్పందానికి వచ్చినట్లు గుర్తుచేశారు. తాజాగా గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ముగించడంలో ఇది ఎనిమిదో యుద్ధమని చెప్పుకొచ్చారు. యుద్ధాలను ముగించడంలో తాను మంచివాడిని అని చెప్పుకొచ్చారు. ఆయా దేశాల్లో ఒకచోట 31 ఏళ్లుగా, ఇంకొకచోట 32 ఏళ్లుగా.. మరొక చోట 37 ఏళ్లుగా యుద్ధం జరుగుతుంటే.. అవన్నీ ఒక్కరోజులోనే పరిష్కరించినట్లుగా పేర్కొన్నారు. ఇలా చేయడం చాలా బాగుందని తెలిపారు. ఇదంతా నోబెల్ శాంతి బహుమతి కోసం చేయలేదని.. అనేక మంది ప్రాణాలను కాపాడాలనే ఆలోచనతోనే ఇదంతా చేసినట్లుగా చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Kadapa Tragedy: ఏ కష్టం వచ్చిందో ఏమో.. కుటుంబం మొత్తంగా ట్రైన్ కింద పడి ఆత్మహత్య!

దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదర్చడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. నోబెల్ కమిటీకి న్యాయంగా చెప్పాలంటే.. 2024-2025 మధ్య చాలా విషయాలు జరిగాయని గుర్తుచేశారు. 2025లో తాను అధికారంలోకి వచ్చాకే దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొందని.. అనేక మంది ప్రాణాలు కాపాడినట్లు చెప్పుకొచ్చారు. కానీ 2024 విషయాలకే నోబెల్ కమిటీ గుర్తింపు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్నట్లుగా వార్త వినిపించిందని.. తిరిగి వచ్చేంత వరకు వేచి ఉండాలని చెప్పి వెళ్లిపోయారు.

ఇజ్రాయెల్, ఈజిప్టులో ట్రంప్ పర్యటించనున్నారు. సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ట్రంప్ ప్రసంగించనున్నారు. అనంతరం బందీల కుటుంబాలను కలవనున్నారు. అనంతరం ఈజిప్టుకు వెళ్లి అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌ సిసీ నిర్వహిస్తున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

మే 7న భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగింది. అనంతరం ఇరుదేశాల చర్చలతో శాంతి ఒప్పందం జరిగింది. అయితే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటనను ప్రధాని మోడీ ఖండించారు. శాంతి ఒప్పందానికి మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.

Exit mobile version