Nicolas Maduro: అమెరికా, వెనిజులాపై దాడి చేసిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అరెస్ట్ చేసింది. శనివారం తెల్లవారుజామున రాజధాని కారకస్‌పై దాడులు నిర్వహించిన యూఎస్ దళాలు సంచలన అరెస్ట్ చేశాయి. ఈ వార్త మొత్తం యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. రష్యా, ఇరాన్, అర్జెంటీనా, క్యూబా, చైనా వంటి దేశాలు ఖండించాయి.
ఇదిలా ఉంటే, అరెస్టయిన మదురో తొలి ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేశారు. అమెరికన్ దళాలు ఆయనను బంధించిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేవారు. కళ్లకు గంతలు కట్టుకుని ఉన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఫోటోను చూడవచ్చు. నిజంగా ఇది అద్భుతమైన ఆపరేషన్ అని ట్రంప్ అమెరికన్ దళాలపై పొగడ్తలు కురిపించారు. ఈ ఆపరేషన్‌లో కొంత మంది యూఎస్ సైనికులు గాయపడ్డారు, కానీ చనిపోలేదని చెప్పారు.
అరెస్ట్ తర్వాత మదురోను యూఎస్ యుద్ధ నౌకలో అమెరికా తీసుకెళ్లారు. నార్కో టెర్రర్ కేసులు, ఆయుధాల కేసుల కింద మదురోను న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, మదురో అమెరికాలోకి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని మండిపడుతున్నాడు. అమెరికాలోకి అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తున్నాడు.
