Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- ఇరాన్‌పై మరో భారీ దాడికి ప్లాన్?
- ఎన్నికలకు ముందు కీలక చర్చలు
- ట్రంప్-నెతన్యాహు మధ్య సంభాషణ
- ఖండించిన వైట్‌హౌస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై మరోసారి భారీ దాడి జరగనుందా? అధ్యక్షుడు ట్రంప్-ప్రధాని నెతన్యాహు ముందు చర్చలు జరిగాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఇరాన్‌పై మరోసారి భారీ స్థాయిలో సైనిక దాడులు చేపట్టే అవకాశంపై చర్చ జరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ వార్తలను వైట్‌హౌస్ ఖండించింది.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ ‘యాక్సియోస్’ వార్తా సంస్థ ఈ కథనాన్ని ప్రచురించింది. గత వారం ట్రంప్‌తో మాట్లాడిన నెతన్యాహు.. ఇరాన్ తన అణు కార్యక్రమంలోని వివిధ విభాగాలను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతోందన్న ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ‘పికాక్స్ మౌంటెన్’ను యురేనియం శుద్ధి కేంద్రంగా ఇరాన్ ఉపయోగించే అవకాశంపై నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్ సైనిక స్థావరాలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా మరోసారి దాడులు చేసే అవకాశాన్ని ఇరువురు నేతలు చర్చించినట్లు యాక్సియోస్ తెలిపింది. అయితే ట్రంప్ మాత్రం మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై కొత్త దాడులు చేపట్టబోమని బహిరంగంగా సంకేతాలిచ్చినట్లు నివేదిక పేర్కొంది.
ట్రంప్ వైఖరిపై స్పష్టత లేకపోయినా.. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు అప్రమత్తంగా ఉన్నాయని, వాషింగ్టన్ నుంచి ఆదేశాలు వస్తే దాడులు చేపట్టేందుకు సన్నాహాలు కొనసాగిస్తున్నాయని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ యాక్సియోస్ వెల్లడించింది. ఇరాన్‌పై సైనిక చర్యలను తిరిగి ప్రారంభించేందుకు నెతన్యాహు ఆసక్తి చూపుతున్నట్లు ఓ అమెరికా అధికారి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. ఈ అంశంపై ఆయన ట్రంప్‌తో పలుమార్లు చర్చించినప్పటికీ.. దాడులకు ఆమోదం తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని ఆ అధికారి స్పష్టం చేసినట్లు సమాచారం.
గత రెండు వారాల్లో ఇరాన్‌పై మళ్లీ పెద్ద ఎత్తున సైనిక చర్యలు చేపట్టే అవకాశంపై ఇరువురు నేతలు పలుమార్లు మాట్లాడుకున్నట్లు యాక్సియోస్ కథనం వెల్లడించింది. అక్టోబర్ 2న క్యాంప్ డేవిడ్‌లో జరిగిన సుదీర్ఘ సమావేశంలో ట్రంప్ ఉన్నతస్థాయి మంత్రివర్గ సభ్యులు కూడా తదుపరి కార్యాచరణ, కొత్త దాడుల అవకాశాలపై చర్చించినట్లు నివేదిక పేర్కొంది.
భిన్నాభిప్రాయాలు
ఇరాన్‌పై తదుపరి చర్యల విషయంలో ట్రంప్ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదట దాడులను తిరిగి ప్రారంభించేందుకు ట్రంప్ సానుకూలంగా స్పందించినప్పటికీ.. ఆ తర్వాత వెనుకడుగు వేసినట్లు ఓ ఇజ్రాయెల్ అధికారి తెలిపినట్లు యాక్సియోస్ పేర్కొంది. ట్రంప్ వైఖరి పలుమార్లు మారిందని మరో అమెరికా అధికారి వ్యాఖ్యానించినట్లు నివేదిక వెల్లడించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, అమెరికా సెంట్రల్ కమాండ్‌లోని సీనియర్ అధికారులు ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలు చేపట్టాలని బలంగా కోరుతున్నట్లు ఓ వర్గం తెలిపింది. అయితే ట్రంప్ ఇతర సలహాదారుల్లో చాలామంది తక్షణ సైనిక దాడులకు బదులుగా ఆర్థిక ఆంక్షలు, ఇతర ఒత్తిడి చర్యలను కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇరాన్‌పై కొత్త దాడులు రాజకీయంగా కీలక పరిణామాలకు దారితీయవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. దాడులకు ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేపడితే భద్రతాపరమైన పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ మధ్య జరిగిన చర్చల గురించి తెలిసిన ఓ వర్గాన్ని ఉటంకిస్తూ యాక్సియోస్ కీలక విషయాన్ని వెల్లడించింది. రాబోయే మూడు వారాల్లో పూర్తిస్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశంపై ఇరువురు సైనికాధికారులు చర్చించినట్లు తెలిపింది. ఆ సమయంలో యుద్ధం మొదలైతే ఇరాన్ భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులతో ప్రతిదాడులు చేసే ప్రమాదం ఉందని జమీర్ హెచ్చరించినట్లు నివేదిక పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఎన్నికలను వాయిదా వేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇరాన్‌పై దాడులు చేపడితే.. రాజకీయ ప్రయోజనం కోసం నెతన్యాహు యుద్ధాన్ని ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూడా కథనం పేర్కొంది. దీనివల్ల రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన సైన్యంపై ప్రజల్లో ఉన్న విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..