Site icon NTV Telugu

Donald Trump: ఇరాన్ కోసం ట్రంప్ MIGA నినాదం.. లొంగిపోవాలని వార్నింగ్..

Trump

Trump

Donald Trump: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కీలక హెచ్చరిక చేశారు. ఇరాన్ ‘‘బేషరతుగా’’ లొంగిపోతేనే ఇరాన్‌తో ఏదైనా ఒప్పందం సాధ్యమవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. లొంగిపోకపోతే ఒప్పందం లేదని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లొంగిపోయే వరకు, దౌత్యమార్గం లేదని అన్నారు.

Read Also: ICC T20 World Cup: “మహ్మద్ అమీర్ కన్నా ఊసరవెళ్లి నయం”.. భారత్ విజయంతో మాట మార్పు..

ఇరాన్ లొంగిపోయి “ఆమోదయోగ్యమైన మరియు బలమైన నాయకత్వం” ఎన్నికైతే, అమెరికా మరియు దాని మిత్రదేశాలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి కలిసి పనిచేస్తాయని హామీ ఇచ్చారు. ‘‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్(ఇరాన్‌ను గొప్పగా చేయండి)’’ అంటూ తన నినాదాన్ని ఇచ్చారు. గతంలో అమెరికా ఎన్నికల వేళ ట్రంప్ ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్(MAGA)’’ అంటూ సుప్రసిద్ధ నినాదం ఇచ్చారు. ఇప్పుడు ఇరాన్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.

ఇరాన్ రాజకీయ భవిష్యత్తును రూపొందించడంలో తాను ప్రత్యక్ష పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీకి ఇరాన్ సుప్రీంలీడర్ అయ్యేంత సీన్ లేదని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. అయితే, కొన్ని దేశాలు ఈ యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించాయిన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.

Exit mobile version