పెన్సిల్వేనియా ప్రచార సభలో ఒక మహిళ చొరవ కారణంగానే తాను ప్రాణాలతో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎన్నికల ప్రచార వేదికపైకి ఆమెను పిలిచి హగ్ చేసుకున్నారు. ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడమని ట్రంప్ మైక్ ఇస్తే.. హాయ్ చెప్పేసి కిందకి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: NEET Case: నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ చార్జ్‌షీటు దాఖలు
అమెరికాలోని హారిస్‌బర్గ్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహిళను వేదిక పైకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు. మహిళ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని ట్రంప్ వెల్లడించారు. పెన్సిల్వేనియా ప్రచార సభలో తాను మాట్లాడుతున్న సమయంలో.. దుండగుడు కాల్పులు జరపడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన సంఘటనను ట్రంప్ గుర్తు చేసుకున్నారు. కంప్యూటర్ సెక్షన్ సిబ్బందిలో ఒక మహిళ వలసదారుల చార్ట్‌ను స్క్రీన్‌పై ప్రదర్శించింది. దాన్ని చూసేందుకు తన తలను అటు వైపుగా తిప్పినట్లు చెప్పారు. ఆ సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపాడని.. అంతలోనే తలకు బదులుగా చెవిని బుల్లెట్ తాకుతూ దూసుకెళ్లిందని గుర్తుచేశారు. ఆ పని చేసిన మహిళ కారణంగానే ప్రాణాలతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Ashwini Vaishnaw: రైళ్లలో ‘కవచ్’పై రైల్వేమంత్రి కీలక ప్రకటన