Site icon NTV Telugu

ట్రంప్ నోట‌…2024 ఎన్నిక‌ల మాట‌…

గ‌తేడాది జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే.  ఇప్ప‌టీకీ ట్రంప్ ఓట‌మిని అంగీక‌రించ‌డంలేదు.  అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తానే విజ‌యం సాధించాన‌ని, ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, త‌న‌వ‌ద్ద అన్నిరాకాల ఆధారాలు ఉన్నాయ‌ని, వాటిని కోర్టుకు స‌మ‌ర్పించినా, కోర్టు ప‌ట్టించుకోలేద‌ని ట్రంప్ పేర్కోన్నారు.

Read: న్యూయార్క్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసిన స్టార్ హీరోయిన్

 వ‌చ్చే ఏడాది అమెరికాలో మిడ్‌ట‌ర్మ్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.   ఓహియోలో జ‌రిగిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ట్రంప్ పాల్గొన్నారు.  ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌సంగించారు.  ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌పై విమ‌ర్శానాస్త్రాలు సందించారు.  మిడ్‌ట‌ర్మ్ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా త‌మ పార్టీ అభ్య‌ర్దులు విజ‌యం సాధిస్తామ‌ని తెలిపారు.  2024 అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌రోసారి పోటీ చేస్తాన‌ని, త‌ప్ప‌కుండా అమెరికా అధ్య‌క్షుడిగా విజ‌యం సాధిస్తామ‌ని అన్నారు.  2024 ఎన్నిక‌ల‌పై దృష్టి సారించిన‌ట్టు తెలిపారు.  

Exit mobile version