Site icon NTV Telugu

Trump Dance: జపాన్‌లోనూ మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన ట్రంప్.. వీడియో వైరల్

Trump

Trump

ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా ఉత్సాహంగా గడుపుతున్నారు. 79 ఏళ్ల వయసులో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐదు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా సోమవారం మలేసియాకు వచ్చారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగగానే స్థానిక కళాకారులు డాన్స్‌తో స్వాగతం పలికారు. దీంతో ట్రంప్‌కు ఒక్కసారిగా ఉత్సాహం వచ్చేసింది. దీంతో కుర్రాడిలో మారిపోయి వారితో కలిసి కొద్దిసేపు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

ఇది కూడా చదవండి: Gaza-Israel: గాజాలో మళ్లీ దాడులు.. 30 మంది మృతి

తాజాగా మలేషియా పర్యటన ముగించుకుని జపాన్‌కు వెళ్లారు. అక్కడ కూడా ఇదే ఉత్సాహాన్ని కనుబరిచారు. జపాన్‌లో అమెరికా విమాన వాహక నౌకలో మెరైన్‌లతో కలిసి నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోతంది.

ఇది కూడా చదవండి: Rashmika : అప్పుడే చెప్తా.. విజయ్ తో ఎంగేజ్ మెంట్ పై రష్మిక రియాక్ట్

జపాన్ పర్యటనలో భాగంగా మంగళవారం యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ నౌకలో నేవీ సిబ్బందిని ట్రంప్ కలిశారు. వారిని ఉద్దేశించి ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. అనంతరం వారిని ఉత్తేజభరిచారు. స్టేజ్‌పై ట్రేడ్‌మార్క్ ‘YMCA’ నృత్యం చేశారు. దీంతో నేవీ సిబ్బంది కూడా ఉల్లాసంగా ట్రంప్‌తో కలిసి స్టెప్పులు వేశారు.

ఈ కార్యక్రమానికి ట్రంప్‌తో పాటు జపాన్ నూతన ప్రధాని సనే తకైచి కూడా ఉన్నారు. ఆమె కూడా ట్రంప్‌ను చూసి ఉల్లాసంగా కనిపించారు. ఈ సందర్భంగా సనే తకైచిని ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. గొప్ప నాయకురాలు అంటూ కొనియాడారు. అనంతరం సనే తకైచి మాట్లాడుతూ.. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కోసం పేరును నామినేట్ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు.

Exit mobile version