Modi-Trump: బెంగాల్‌లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
- బెంగాల్‌లో బీజేపీ విజయంపై స్పందించిన ట్రంప్
- ప్రధాని మోడీని అభినందించిన ట్రంప్
- చారిత్రాత్మక, నిర్ణయాత్మక ఎన్నికల విజయంగా అభివర్ణన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. బెంగాల్ విజయంపై ప్రధాని మోడీకి ట్రంప్ అభినందనలు తెలిపారు. ‘‘చారిత్రాత్మక, నిర్ణయాత్మక ఎన్నికల విజయం.’’గా వైట్‌హౌస్ అభివర్ణించింది. ఈ విజయంపై మోడీకి ట్రంప్ అభినందనలు తెలిపినట్లుగా పేర్కొంది.
వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ మాట్లాడుతూ.. ఇటీవల ట్రంప్-మోడీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో భారతదేశానికి మోడీ వంటి నాయకుడు ఉండటం అదృష్టమని ట్రంప్ పేర్కొన్నారని తెలిపారు. తాజా ఎన్నికల విజయంపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా మోడీకి అభినందనలు తెలియజేశారని చెప్పారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు గాను 207 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంలో నుంచి దించింది. మమత నేతృత్వంలోని టీఎంసీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకు నాంది పలికాయి. ఇక అస్సాంలో కూడా బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. పుదుచ్చేరిలో కూడా బీజేపీ బలమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఇక కేరళలో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF) స్పష్టమైన మెజార్టీతో 140 స్థానాల్లో 100 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF) కేవలం 35 సీట్లకే పరిమితమైంది. ఇక తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలన విజయం సాధించింది. 234 స్థానాల్లో టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 8 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ ప్రభుత్వాలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 18 రాష్ట్రాలకు చేరింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!