Site icon NTV Telugu

Trump: ఖతార్‌లో ఇజ్రాయెల్ దాడులు.. తనకేమీ తెలిదన్న ట్రంప్

Trump55

Trump55

హమాస్ నాయకులే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్ మెరుపుదాడులకు దిగింది. వరుస పేలుళ్లతో దోహా దద్దరిల్లింది. వైమానిక దాడుల్లో మంటలు చెలరేగాయి. నివాస భవనాల నుంచి మంటలు చెరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ చర్యను ఖతార్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు తీవ్ర ఉధృతిని రేకెత్తిస్తాయని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. హడలెత్తిస్తున్న ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

ఇక ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్-థాని తీవ్రంగా ఖండించారు. దాడిలో ఖతార్ భద్రతా అధికారి సహా ఆరుగురు మరణించినట్లు తెలిపారు. అయితే తమకు కూడా ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉందని చెప్పారు. స్పష్టమైన దాడికి ప్రతిస్పందించే హక్కు ఉందంటూ మీడియాతో అన్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణకు రక్షణ శాఖ భూములు.!

ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ కూడా ఖండించారు. ఈ దాడుల ఆదేశం తనది కాదని.. ఇజ్రాయెలే చేసిందని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకే ఖతార్‌లో దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఇక ఈ దాడులపై విచారం వ్యక్తం చేశారు. తన సన్నిహిత మిత్రదేశంపై ఏకపక్ష దాడులు చేయడం భావ్యం కాదన్నారు.

దాడి గురించి ఖతార్ అధికారులకు తెలియజేయాలని ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌కు వెంటనే ఆదేశించానని.. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తూ ఖతార్ రాజధాని దోహాలోని ఒక ప్రాంతంలో హమాస్‌ నివాసం ఉన్న ఇంటిపై ఇజ్రాయెల్ దాడి చేసిందన్నారు. ఇది నెతన్యాహు తీసుకున్న నిర్ణయం అని.. తనకేమీ తెలియదని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్‌ చేశారు.

ఇక మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నేను న్యాయంగా ఉన్నాను. మొత్తం పరిస్థితి గురించి నేను ఉత్సాహంగా లేను. బందీలను తిరిగి కోరుకుంటున్నాం. కానీ ఈరోజు జరిగిన తీరు గురించి మాత్రం ఉత్సాహంగా లేము.’’ అని అన్నారు. దాడి తర్వాత తాను నెతన్యాహుతో మాట్లాడానన్నారు. శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పారని వెల్లడించారు. ఇక ఖతార్‌లో ఎలాంటి దాడి జరగదని ట్రంప్ హామీ ఇచ్చారు.

 

 

 

Exit mobile version