Site icon NTV Telugu

Trump-China: ట్రంప్ సుంకాల బెదిరింపుపై స్పందించిన చైనా.. ఏమన్నాదంటే..!

Chinatrump

Chinatrump

ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే.. చైనా ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

తాజాగా ట్రంప్ సుంకాల బెదిరింపుపై చైనా స్పందించింది. అమెరికా నిరాధారమైన ఆరోపణలు చేసిందని ఖండించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ మాట్లాడుతూ… రక్షణ వ్యవస్థలతో సహా ఆయుధాలను సరఫరా చేస్తు్న్నామన్న ఆరోపణలను తిరస్కరించింది. బీజింగ్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. అయినా ‘‘సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు.’’ అని చైనా తేల్చి చెప్పింది.

ఇటీవల ఇరాన్-అమెరికా 40 రోజుల యుద్ధానికి తాత్కాలింకంగా రెండు వారాల పాటు వాయిదా పడింది. అనంతరం గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-చైనా మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలు సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో రెండు దేశాల ప్రతినిధులు తిరిగి స్వదేశాలకు వెళ్లిపోయారు. దీంతో మళ్లీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తిరిగి ఇరాన్‌పై దాడులు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇరాన్‌పై సైనిక దాడులతో సహా హార్ముజ్ జలసంధిపై నావికా దిగ్బంధానికి అమెరికా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఈ క్రమంలోనే ఇరాన్‌కు చైనా భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తే 50 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ బెదిరించారు.

 

Exit mobile version