Site icon NTV Telugu

Trump: లండన్ మేయర్ దుష్టుడు.. బ్రిటన్ ప్రధాని పక్కన ఉండగానే ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి నోటికి పని చెప్పారు. ఇటీవల న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారికంగా డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మమ్దానీ అభ్యర్థిత్వాన్ని ట్రంప్ అంగీకరించలేదు. తాజాగా స్కాట్లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్.. పక్కన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఉన్న విషయం కూడా లెక్క చేయకుండా లండన్ మేయర్‌పై దూషణ పర్వం కొనసాగించారు. లండన్ మేయర్ దుష్టుడు అని.. అతడు చేయకూడని పని చేశాడంటూ మండిపడ్డారు. సెప్టెంబర్‌లో లండన్‌లో పర్యటించనున్నారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా ట్రంప్ సమాధానం ఇచ్చారు. తానేమీ మేయర్ అభిమానిని కాదని.. అతడు చేయకూడని పని చేశాడంటూ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Karnataka: ఓ అక్క మరణశాసనం.. వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య

సోమవారం స్కాట్లాండ్‌లో యూకే ప్రధానితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ట్రంప్ దూషణల పర్వానికి దిగారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో అత్యధిక జనాభా కలిగిన లండన్‌కు తొలి ముస్లిం మేయర్‌గా సాదిక్ ఖాన్ గుర్తింపు పొందారు. 2016, మే 9న ఖాన్ లండన్‌ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లోనే ట్రంప్.. సాదిక్‌ ఖాన్‌పై పలు విమర్శలు చేశారు. బ్రిటన్‌లో సాదిక్‌ ఖాన్‌ను మెరటు వ్యక్తి అని, అజ్ఞాని అని ట్రంప్ సంబోధించారు. తాజాగా మరోసారి సాదిక్ ఖాన్ దుష్టుడు అంటూ సంభోదించారు. అయితే ఇటువంటి విమర్శలు పట్టించుకోనని గతంలో సాదిక్ ఖాన్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Honor killing: మరో పరువు హత్య.. ఎస్ఐ కూతురుతో ప్రేమ.. చంపేయాలని కొడుకుతో చెప్పిన తల్లిదండ్రులు

 

Exit mobile version