Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిచిగాన్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరుఫున సెనెట్‌కు పోటీ చేస్తున్నన అబ్దుల్ అల్ – సయ్యద్‌ను ఉద్దేశించి ట్రంప్.. ‘‘ అబ్దుల్ ఎలా ఉన్నావు..? నువ్వొక జిహాదీవి’’ అని అన్నారు. తన ప్రసంగంలో అబ్దుల్‌ను జిహాదీగా అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఆయనపై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆయనను ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన జిహాదీ సభ్యుడిగా పేర్కొన్నారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రవాద దాడి గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు.
నవంబర్ నెలలో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అబ్దుల్ అల్ సయ్యద్ విజయం సాధిస్తే, అమెరికా సెనేట్‌లో ప్రవేశించే ముందు ఆయన మెటల్ డిటెక్టర్ల ద్వారా భద్రతా తనిఖీలకు హాజరుకావాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా ఆయన కుటుంబానికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. ఒక వేళ ఆయన ఎన్నికల్లో గెలిస్తే, సున్నితమైన జాతీయ భద్రతా సమాచారాన్ని పొందే అవకాశం ఉందని అన్నారు.
ఇదిలా ఉంటే ఫ్లోరిడాలోని డేటోనా బీచ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌కు నిరసన సెగ తగిలింది. ఆయన ప్రసంగం మధ్యలో నిరసనకారులు నాలుగు సార్లు అడ్డుతగిలారు. ఈ సమయంలో సహనం కోల్పోయిన ట్రంప్.. ‘‘నోరు మూయ్..ఇతడిని ఇక్కడ నుంచి తీసుకెళ్లండి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇప్పటికే 4.3 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కును ఉపయోగించుకున్నారు.

