అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్-కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ జరిగింది. అయితే అమెరికన్ పాప్‌స్టార్ టేలర్ స్విఫ్ట్.. బహిరంగంగా కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు. ఈ విషయం మాజీ అధ్యక్షుడు ట్రంప్ కోపం తెప్పించింది. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను టేలర్ అభిమానిని కాదన్నారు. ఆమె చాలా ఉదారవాద వ్యక్తి అన్నారు. అయితే ఆమె ఎల్లప్పుడూ డెమొక్రాట్లనే సమర్థిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. తర్వాత మాత్రం తగిని మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: అటవీ సంపదను కాపాడటంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయం
కమలా హారిస్-ట్రంప్ మధ్య తొలి డిబేట్ జరిగిన తర్వాత టేలర్ స్విఫ్ట్ సోషల్ మీడియా వేదికగా కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. కమలా హారిస్ దేశ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారన్నారు. వారియర్ అయిన కమలా హారిస్ ఛాంపియన్‌గా గెలవాల్సిన అవసరం ఉందని స్పస్టం చేశారు. గొడవలు, గందరగోళం లేకుండా ప్రశాంతంగా పరిపాలన అందిస్తే.. దేశం చాలా సాధించగలదని ఆమె అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Manoj- Lakshmi: మనోజ్ కి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. షాక్ కి గురైన యంగ్ హీరో (వీడియో)