Donald Trump: “మూడో ప్రపంచ దేశాల” నుంచి వలసల్ని అనుమతించం.. భారత్ ఈ జాబితాలో ఉందా.?
- మూడో ప్రపంచ దేశాల నుంచి వలసల్ని శాశ్వతంగా నిలిపేస్తాం..
- వైట్ హౌజ్ షూటింగ్ ఘటన తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: వైట్ హౌజ్‌లో సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సెక్యూరిటీ సిబ్బందిపై ఆఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ‘‘మూడో ప్రపంచ దేశాల’’ నుంచి అమెరికాలోకి వలసల్ని శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొలుకుంటుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. మెరుగైన జీవితం, విద్య, సొంత దేశాల్లోని హింస నుంచి తప్పించుకుని అమెరికాలోకి వలస వెళ్లే లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుంది.
Read Also: CM Chandrababu: రైతుల సహకారం మరువలేనిది.. అమరావతిని వినూత్నంగా నిర్మిస్తున్నాం!
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ అమెరికా సాంకేతికంగా పురోగతి సాధించినప్పటికీ, దాని వలస విధానం చాలా మంది జీవన పరిస్థితుల్ని నాశనం చేసింది’’ అని కామెంట్ చేశారు. బైడెన్ హయాంలో అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తామని చెప్పారు. అమెరికాను ప్రేమించలేని వారిని తొలగిస్తామని, అమెరికాకు చెందని వారి ఫెడరల్ ప్రయోజనాలను, సబ్సిడీలను ఇప్పటికే ముగించానని, పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేని ఏ విదేశీయుడినైనా బహిష్కరిస్తాననని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ఉపయోగం లేని వారిని, హత్యలకు నేరాలకు పాల్పడే వారిని దేశం నుంచి గెంటేస్తామని చెప్పారు.
మూడో ప్రపంచ దేశాలు అంటే ఏమిటి.?
మొదటి, రెండో, మూడో ప్రపంచ దేశాలు అనే భావన 20వ శతాబ్ధం మధ్యలో కోల్డ్ వార్ సమయంలో వచ్చింది. మొదటి ప్రపంచ దేశాల్లో అమెరికా, నాటో మిత్ర దేశాలు, పశ్చిమ యూరప్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. రెండో ప్రపంచం అంటే సాధారణంగా కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్, దాని మిత్రదేశాలైన తూర్పు యూరప్ దేశాలు, క్యూబా, చైనాలను సూచించేది. మూడో ప్రపంచ దేశాలు అంటే సాధారణంగా కోల్డ్ వార్‌లో ఇటు అమెరికా, అటు రష్యా వైపు లేని దేశాలను పిలిచేవారు. ఈ దేశాలు ఎక్కువగా పేద దేశాలు, యూరోపియన్ కాలనీలుగా ఉన్న దేశాలను పిలుస్తారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలు ఈ జాబితాలో ఉంటాయి.
అయితే, ప్రస్తుత ప్రపంచంలో ‘‘థర్డ్ వరల్డ్ కంట్రీస్’’ అనే పదం పెద్దగా వాడుకలో లేదు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలుగా పిలుస్తోంది. యూఎన్ జాబితాలో లో డెవలప్ నేషన్స్(LDC) జాబితాలో 44 దేశాలు ఉన్నాయి. ఆసియా నుంచి 8 దేశాలు, కరేబియన్ నుంచి హైతీ, ఫసిఫిక్ దేశాలైన సోలమన్ ఐలాండ్స్, కిరిబాటి, తుపాలు ఉన్నాయి. ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ ఉన్నాయి.
ప్రస్తుతం, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ మరియు దిగువ మధ్య తరగతి ఆదాయ దేశాలు వంటి పదాలను ఉపయోగిస్తున్నారు. కోల్డ్ వార్ సమయంలో ఈక్వేషన్ ఉపయోగిస్తే, భారత్ అలీన విధానంతో అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలకు దూరంగా ఉంది. దీనిని బట్టి చూస్తే భారత్ ‘‘మూడో ప్రపంచ దేశమే’’. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇటీవల జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఈ వివరణను తీసుకుంటే భారత్ ను మూడో ప్రపంచ దేశంగా పరిగణించలేము.
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!